Vitamin Deficiency: మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్ చాలా అవసరం. వివిధ రకాల పోషక పదార్ధాలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఆరోగ్యం లేదా అనారోగ్యం రెండు పోషకాలపైనే ఆధారపడి ఉంటాయి. ఇందులో అత్యంత కీలకమైంది విటమిన్ బి12.
మనిషి శరీరంలో ఒక్కొక్క విటమిన్‌కు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. విటమిన్లు లేకుండా శరీరం పని చేయదు. విటమిన్ల లోపముంటే జ్ఞాపకశక్తి బలహీనమైపోతుంది. దాంతో పాటు ఇతర సమస్యలు చాలా ఎదురౌతాయి. ఇందులో అత్యంత ముఖ్యమైంది విటమిన్ బి12. విటమిన్ బి12 శరీరానికి అవసరమైన న్యూట్రియంట్. విటమిన్ బి12 లోపముంటే ఆరోగ్యపరంగా హాని కలుగుతుంది. శరీరంలో పోషక పదార్ధాల పని డీఎన్ఏ నిర్మాణం, ఫోలిక్ యాసిడ్ సంగ్రహించడం ప్రధాన విధి. రోజూ కొన్ని రకాల ఆహార పదార్ధాలను డైట్‌లో చేర్చకపోతే ప్రమాదకర వ్యాధులు ఎదురౌతాయి. విటమిన్ బి12 లోపాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.
ఎముకల నొప్పి
చాలామందికి తరచూ ఎముకల నొప్పి సమస్య తలెత్తుతుంటుంది. విటమిన్ బి12 లోపముంటే ఇదే సమస్య ఎదురౌతుంది. అందుకే కొన్ని ఆహార పదార్ధాలను డైట్‌లో చేరిస్తే నడుము నొప్పి, బ్యాక్ పెయిన్ వంటివి ఎదురౌతాయి.
జ్ఞాపకశక్తి తగ్గడం
విటమిన్ బి12 లోపముంటే మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉండదు. చాలా మానసిక సమస్యలు ఉత్పన్నమౌతాయి. చాలామందిలో జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతుంటారు. అందుకే విటమిన్ బి 12 లోపం లేకుండా చూసుకోవాలి.
రక్త హీనత
విటమిన్ బి 12 లోపముంటే ఎనీమియా సమస్య తలెత్తుతుంది. శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ నిర్మాణం మందగిస్తుంది. ఫలితంగా రక్త హీనత సమస్య ఏర్పడుతుంది. వీటితో పాటు ఇంకా ఇతరత్రా సమస్యలు చాలా ఏర్పడతాయి.
కంటి వెలుగు తగ్గడం
రోజూ తీసుకునే ఆహారంలో విటమిన్ బి12 పుష్కలంగా ఉండాలి. విటమిన్ బి12 లోపముంటే కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. కంటి వెలుగు తగ్గిపోతుంది. కళ్లు మసకగా కన్పిస్తాయి. చిన్న చిన్న అక్షరాలు చదివేటప్పుడు తీవ్ర సమస్య ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. విటమిన్ బి12 అనేది ఆరోగ్యానికి అంత ముఖ్యమైంది.
విటమిన్ బి12 ఎక్కువగా మాంసాహారంలో ఉంటుంది. రెడ్ మీట్ లేదా చేపలు, గుడ్లలో పుష్కలంగా ఉంటుంది. దాంతోపాటు ఆకుపచ్చని కూరగాయలు, మష్రూంలో కూడా ఎక్కువ మోతాదులోనే లభ్యమౌతుంది. అందుకే డైట్‌లో ఈ పదార్ధాలు ఉండేట్టు చూసుకుంటే విటమిన్ బి12 లోపాన్ని సరిచేయవచ్చు.
Also read: Healthy Foods: మలబద్ధకం, అజీర్తి సమస్యలు దూరం కావాలంటే ఈ పదార్ధాలు డైట్‌లో ఉండాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook