Ginger Benefits: ఆ ఒక్క మసాలా ఉంటే చాలు, ప్రమాదర కొలెస్ట్రాల్ సమస్యకు చెక్
Ginger Benefits: ఆధునిక జీవనశైలి వ్యాధుల్లో ప్రధానమైంది, ప్రాణాంతకమైంది కొలెస్ట్రాల్. ఎంత ప్రమాదకరమైందో..అంతే సులభంగా నియంత్రించుకోవచ్చు. సరైన హోమ్ రెమిడీస్ కొన్ని పాటిస్తే చాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
చెడు కొలెస్ట్రాల్ పెరగడం అనేది ఆరోగ్యానికి తీవ్ర హాని కల్గించే పరిణామం. ఒక్క కొలెస్ట్రాల్ సమస్య వివిధ రకాల అనారోగ్య సమస్యలతో పాటు ప్రాణాంతక వ్యాధులకు కూడా దారి తీస్తుంది. అధిక కొలెస్ట్రాల్ ప్రమాదర వ్యాధులకు నిలయమని చెప్పవచ్చు.
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి అధికంగా ఉంటే..బ్లడ్ ప్రెషర్, స్ట్రోక్, హార్ట్ ఎటాక్, డయాబెటిస్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్ వంటి ప్రమాదకర వ్యాధులకు నిలయంగా ఉంటుంది. శరీరంలోని అవయవాలపై కూడా కొలెస్ట్రాల్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కొలెస్ట్రాల్ ఎంత ప్రమాదకరమైందైనా..కొన్ని హోమ్ రెమిడీస్ సహాయంతో ఈ సమస్యను చాలా సులభంగా పరిష్కరించవచ్చు. తద్వారా కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించవచ్చు. ప్రతి వంటింట్లో తప్పకుండా లభించే అల్లం సహాయంతో కొలెస్ట్రాల్ సమస్యను చాలా సులభంగా తగ్గించవచ్చంటున్నారు ప్రముఖ న్యూట్రిషన్లు. ఎందుకంటే అల్లంలో ట్రై గ్లిసరాయిండ్స్, లిపో ప్రోటీన్ తగ్గించే కారకాలుంటాయి
కొలెస్ట్రాల్ తగ్గించడంలో అల్లం కీలకం
పచ్చి అల్లంతో..
అల్లం నేరుగా తినడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఎక్కువగా ఆయిలీ ఫుడ్ తీసుకునే అలవాటుంటే..దాంతోపాటు రోజూ పచ్చి అల్లం కొద్దిగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. లేదా రోజూ పరగడుపున కొద్దిగా పచ్చి అల్లం తింటుంటే ఏ విధమైన సమస్య రాదు. ఇలా చేయడం వల్ల కొలెస్ట్రాల్ ముప్పు తగ్గిపోతుంది.
అల్లం పౌడర్
అల్లం పౌడర్ తయారు చేసేందుకు అల్లంను కొద్దిరోజులు ఎండలో ఆరబెట్టాలి. బాగా ఎండిన అల్లాన్ని మిక్సీలో పౌడర్‌గా చేసుకోవాలి. రోజూ ఉదయం పరగడుపున ఈ పౌడర్ గోరు వెచ్చని నీళ్లలో కలుపుకుని తాగాలి. దీనివల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ముప్పు తగ్గిపోతుంది.
అల్లం నీరు
అల్లం నీరు చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు అద్బుతంగా ఉపయోగపడుతుంది. దీనికోసం ఒక గ్లాసు నీల్లలో ఒక ఇంచ్ అల్లం ముక్కను దాదాపు 15 నిమిషాలు వేసి ఉడికించాలి. ఆ తరువాత వడకాచి తాగాలి. దీనివల్ల అల్లం రసం శరీరంలో అన్ని భాగాలకు ప్రసరిస్తుంది.
అల్లం, నిమ్మ టీ
పాలు, తేయాకు, పంచదార టీ గురించి అందరికీ తెలిసిందే. ఇష్టంగా తీసుకుంటుంటారు. ఈసారి నిమ్మ అల్లం టీ తాగి చూడండి. ప్రత్యేకించి ఆయిల్, మసాలా పదార్ధాలు ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు తప్పకుండా తీసుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని ఇది తగ్గిస్తుంది.
Also read: Mood Swing: మూడాఫ్ సమస్యతో బాధపడుతున్నారా, ఈ పదార్ధాలు తింటే చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook