Vitamin K: రీసెర్చ్‌లో షాకింగ్ విషయాలు, విటమిన్ కే లోపిస్తే ఊపిరితిత్తుల సమస్యలు
Vitamin K: శరీర నిర్మాణానికి, ఎదుగుదలకు పోషకాల పాత్ర చాలా కీలకం. వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ తగిన మోతాదులో ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది. పోషక పదార్ధాల లోపం ఏర్పడితే వివిధ రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. ఆ వివరాలు మీ కోసం..
Vitamin K: శరీర నిర్మాణం, ఎదుగుదలలో ఒక్కొక్క విటమిన్‌కు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇందులో మనం ప్రధానంగా చర్చించుకోవల్సింది విటమిన్ కే గురించి. విటమిన్ కే లోపిస్తే కేవలం రక్తం గడ్డకట్టకపోవడమే కాదు ఇంకా ఇతర సమస్యలు కూడా ఉత్పన్నమౌతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తుల ఆరోగ్యం అనేది విటమిన్ కేను బట్టి ఉంటుందని చాలామందికి తెలియదు.
ఆధునిక జీవన విధానం, వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా పోషకాల లోపం ఏర్పడుతుంటుంది. ఒక్కోసారి విటమిన్ల లోపం, కొన్ని సార్లు మినరల్స్ లోపం సంభవిస్తుంటుంది. అదే విధంగా విటమిన్ కే లోపిస్తే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. సాధారణంగా విటమిన్ కే లోపిస్తే రక్తం గడ్డకట్టదని అందరికీ తెలుసు. కానీ విటమిన్ కే లోపంతో ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. విటమిన్ కే లోపించడం వల్ల ఆస్తమా, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మొనరీ వ్యాధి రావచ్చు. విటమిన్ కే అనేది ఆకు కూరల్లో, వనస్పతి ఆయిల్‌లో, ధాన్యాల్లో ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రక్తస్రావం ఎక్కువగా కాకుండా వెంటనే రక్తం గడ్డకట్టేలా చేస్తుంది. ఫలితంగా గాయాలు మాన్పడంలో విటమిన్ కే పాత్ర కీలకమని చెప్పాలి. అయితే ఊపిరితిత్తుల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందని తాజా అధ్యయనాల్లో తేలింది.
ఇటీవల జరిపిన పలు అధ్యయనాల్లో ఇదే అంశం వెల్లడైంది. విటమిన్ కే లోపించినవారిలో ఊపిరితిత్తుల సమస్య అధికంగా ఉన్నట్టు గుర్తించారు. అదే విటమిన్ కే లోపం లేనివ్యక్తుల్లో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉన్నట్టు తేలింది. అంటే విటమిన్ కే అనేది ఊపిరితిత్తుల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడతాయి. ఈ అధ్యయనం కోపెన్‌హేగన్ యూనివర్శిటీ హాస్పటల్, కోపెన్‌హేగన్ యూనివర్సిటీ పరిశోధకులు కలిసి చేశారు. కోపెన్‌హేగన్‌లో నివసించే 24 నుంచి 77 ఏళ్ల వయస్సు కలిగిన 4,092 మందిపై ఈ అధ్యయనం జరిగింది.
విటమిన్ కే లోపముండే వ్యక్తుల్లో ఎఫ్ఈవీ, ఎఫ్‌వీసీ తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. విటమిన్ కే లోపముండే వ్యక్తుల్లో సీవోపీడీ, ఆస్తమా ముప్పు ఎక్కువగా ఉంది. అయితే ఈ విషయంపై మరింత పరిశోధన, అధ్యయనం అవసరమని పరిశోధకులు తెలిపారు.
విటమిన్ కే లభించే పదార్ధాలు
విటమిన్ కే అనేది సాధారణంగా ఆకు కూరల్లో, పచ్చి గింజల్లో, కాలిఫ్లవర్, జీడిపప్పు, కివీ, దానిమ్మ, పాలు, గుడ్లు, చేపల్లో ఎక్కువగా ఉంటుంది. మీ డైట్‌లో ఈ పదార్ధాలు చేర్చుకుంటే విటమిన్ కే లోపం అనేది తలెత్తకుండా ఉంటుంది. తద్వారా మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook