Weight Loss Tips: హెల్తీ లైఫ్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటుంటారు. హెల్తీ లైఫ్ కావాలంటే బరువుపై ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. దాంతోపాటు శరీరం ఎప్పటికప్పుడు డీటాక్స్ అవుతుండాలి. మార్కెట్‌లో చాలా రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నా అన్నింట్లోనూ దుష్పరిణామాల ముప్పు వెంటాడుతుంది. అందుకే సహజసిద్ధమైన కొన్ని చిట్కాలతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్థూలకాయం సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ప్రకృతిలో చాలా రకాల పదార్ధాలున్నాయి. ఇందులో ముఖ్యమైనది తెల్ల ఆనపకాయ. సాధారణంగా తెల్ల ఆనపకాయను ఎప్పుడూ చూసి ఉండరు. ఇది అన్ని ప్రాంతాల్లో లభించదు కానీ ఆరోగ్యపరంగా చాలా అద్బుతమైంది. తెల్ల ఆనపకాయ జ్యూస్ నిజంగా అద్భుతమైన ఔషదమని చెప్పవచ్చు. ఇది బరువు తగ్గించడంతో పాటు శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. ఆనపకాయంటే ఇష్టపడేవారికి మరీ మంచిది. రుచితో పాటు బరువు తగ్గేందుకు లాభిస్తుంది. అధిక బరువు నియంత్రణ నుంచి మొదలుకుని శరీరాన్ని డీటాక్స్ చేసేంతవరకూ ఆనపకాయ వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది.


ఆనపకాయ శరీరానికి ఎనర్జీ కల్గిస్తుంది. తెల్ల ఆనపకాయ జ్యూస్ శరీరానికి ఫ్రెష్‌నెస్, ఎనర్జీ అందిస్తుంది. మీ దినచర్యను అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. రోజంతా ఏ విధమైన ఒత్తిడి లేకుండజా ఉంటుంది. తెల్ల ఆనపకాయను నియమిత మోతాదులో రోజూ తీసుకుంటే బరువు తగ్గించవచ్చు. ఇంకా ఆరోగ్యకరమైన ఇతర ప్రయోజనాలు చాలా ఉన్నాయి. 


బరువు తగ్గించడమనేది ఇటీవలి కాలంలో ఓ ఛాలెంజ్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే కొంతమంది ఎన్నిరకాలుగా ప్రయత్నించినా విఫలమౌతుంటారు. ఈ పరిస్థితుల్లో తెల్ల ఆనపకాయతో ఆశించిన ఫలితాలు పొందవచ్చు. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి. పోషక పదార్ధాలు మెండుగా ఉంటాయి. తెల్ల ఆనపకాయ అనేది చర్మానికి చాలా ప్రయోజనకరం. ఇందులో మిటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. మీ చర్మాన్ని సుందరంగా, మెరిసేలా చేస్తుంది. తగిన మోతాదులో రోజూ తీసుకుంటే మంచి పలితాలు పొందవచ్చు.


జీర్ణవ్యవస్థను సరి చేసేందుకు తెల్ల ఆనపకాయ బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. కడుపులో తలెత్తే గ్యాస్‌ను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని ఎప్పటికప్పుడు డీటాక్స్ చేయడం చాలా అవసరం. ఆధునిక జీవనశైలిలో ఇది తప్పనిసరి. శరీరంలోని వివిధ అంగాల్లో పేరుకునే విష పదార్ధాలను తొలగించడంతో తెల్ల ఆనపకాయ అద్భుతంగా పనిచేస్తుంది. 


Also read: Kidney health Tips: కిడ్నీలు పాడవడానికి కారణాలు ఈ చెడు అలవాట్లే, ఇవాళే దూరం చేసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook