Kidney health Tips: ఆధునిక జీవన విధానంలో ప్రధానంగా ఎదురౌతున్న వివిధ రకాల సమస్యల్లో ఒకటి కిడ్నీ సమస్య. కిడ్నీలు సరిగ్గా పనిచేస్తుంటే శరీరంలో అన్ని అవయవాల పనితీరు ఏ సమస్య లేకుండా సాగిపోతుంటుంది. ఇంతటి ముఖ్యమైన కిడ్నీలను పాడు చేసేది మన ఆహారపు అలవాట్లే మరి.
శరీరంలో అతి ముఖ్యమైన అంగం కిడ్నీలు. శరీరంలోని వ్యర్ధాల్ని తొలగించి బయటకు పంపించడం కిడ్నీల పని. నిజంగానే ఇది చాలా ముఖ్యమైన పని. ఈ పని సరిగ్గా జరగకపోతే లేదా కిడ్నీలు విఫలమైతే విష పదార్ధాలన్నీ శరీరంలోనే పేరుకుపోయి..వివిధ వ్యాధులు చుట్టుముడుతుంటాయి. కిడ్నీలు విఫలమైతే డయాలసిస్ వంటి క్లిష్టమైన మెడికల్ ప్రక్రియ తీసుకోవల్సి ఉంటుంది. అసలు కిడ్నీలు పాడయ్యేది మన ఆహారపు అలవాట్ల కారణంగానే. ప్రస్తుత బిజీ జీవనవిధానం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల కిడ్నీలపై దుష్ప్రభావం పడుతోంది. దురదృష్టమేమంటే మనం ఎలాంటి తప్పు చేస్తున్నామో కూడా పసిగట్టలేని పరిస్థితి ఉంటుంది.
కిడ్నీల ఆరోగ్యాన్ని పాడు చేయడంలో కీలక భూమిక పోషించేది మన ఆహారపు అలవాట్లే. అందుకే ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా జంక్ ఫుడ్, ఫాస్ట్ పుడ్స్, ఆయిలీ పుడ్స్‌కు దూరంగా ఉండాలి. సాధ్యమైనంతవరకూ పచ్చని కూరగాయలు, తాజా పండ్లు, ఫ్రూట్ జ్యూస్ వంటివి తీసుకోవాలి. అనారోగ్యకరమైన ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి. రెడ్ మీట్, బర్గర్, పిజ్జా వంటివి మానేయాలి.
చాలా సందర్భాల్లో ప్రయాణంలో ఉన్నప్పుడు లేదా రాత్రి నిద్రించేటప్పుడు చాలామంది మూత్రాన్ని బలవంతంగా ఆపుకుంటుంటారు. మరీ ముఖ్యంగా ఈ అలవాటు మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. కానీ ఇలా చేయడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరగి ప్రమాదకరంగా మారుతుంది.
మనిషి శరీరం అధికభాగం ఉండేది నీళ్లే. అందుకే సాధ్యమైనంతవరకూ ఎక్కువ నీళ్లు తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. అప్పుడే శరీరంలోని అన్ని అంగాలు సక్రమంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. శరీరంలో నీటి కొరత ఏర్పడితే విష పదార్ధాలు బయటకు తొలగడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దాంతో కిడ్నీలు శుభ్రం కావు. కిడ్నీలో రాళ్ల సమస్య వంటివి ఎదురౌతాయి. అందుకే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా చేయాల్సింది ఎక్కువ నీళ్లు తాగడం.
Also read: Sciatica pain: నడుము నుంచి కాళ్ల వరకూ తరచూ నొప్పిగా ఉంటే నిర్లక్ష్యం వద్దు, ప్రమాదకరం కావచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook