Throat Problems: కొంతమందికి గొంతు గరగరగా ఉంటూ ఇబ్బంది పడుతుంటారు. గొంతు ఎలర్జీ కావచ్చు లేదా మరేదైనా కారణం కావచ్చు గొంతు సంబంధిత సమస్యల్నించి ఉపశమనం పొందాలంటే ఈ ఆహారపదార్ధాలు డైట్‌లో చేర్చుకోమంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గొంతు సంబంధిత సమస్యలు కేవలం చలికాలంలోనే కాదు..వేసవిలో కూడా వస్తుంటాయి. సీజన్‌తో సంబంధం లేకుండా వచ్చే గొంతు సంబంధిత సమస్యలకు ప్రధాన కారణం ఎలర్జీ లేదా ఇన్ ఫెక్షన్. గొంతు గరగరగా ఉండటం ప్రధానమైన సమస్య. ముఖ్యంగా దగ్గు, జలుబు సమస్యలకు తోడు గొంతు సంబంధిత ఎలర్జీలు వస్తుంటాయి. గొంతులో గరగర, ఎలర్జీలు సమస్యాత్మకంగా మారుతుంటాయి. ఎలర్జీతో బాధపడేవారు కొన్ని రకాల ఆహారపదార్ధాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితముంటుంది. గొంతునొప్పి గానీ, ఎలర్జీ వంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఈ హెల్త్ టి‌ప్స్ పాటించాలని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.


అల్లంతో అద్భుత ప్రయోజనాలు


గొంతునొప్పి తగ్గించే లక్షణాలు అల్లంలో చాలా ఉంటాయి. ఈ సమస్యలతో బాధపడేవారు రోజూ అల్లంను వండే వంటల్లో వినియోగించడం చాలా మంచిది. లేదా సాయంత్రం వేళల్లో అల్లం టీ తాగడం వల్ల గొంతునొప్పి నుంచి విముక్తి పొందవచ్చు. కొద్దిగా అల్లాన్ని టీ లేదా తేనెలో కలుపుకుని తీసుకుంటే మెరుగైన ఫలితముంటుంది. ఎందుకంటే తేనె అనేది చాలా రకాల ఎలర్జీల్ని నియంత్రిస్తుంది. గ్రీన్ టీ కూడా ఎలర్జీని దూరం చేసేందుకు దోహదపడుతుంది. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్లు, యాంటీ ఎలర్జిటిక్ ఏజెంట్లు అధికంగా ఉన్నాయి. ఎలర్జీని నియంత్రించేందుకు సహకరిస్తుంది. రోజుకు ఒకట్రెండు కప్పుల గ్రీన్ టీ తీసుకోవడం ఉత్తమం.


విటమిన్ సితో గొంతు గరగరకు పరిష్కారం


ఇక విటమిన్ సి నిండిన పండ్లను తినడం ద్వారా గొంతులో ఏర్పడే గరగరను తగ్గించుకోవచ్చు. పండ్లలో ఉండే యాంటీ హిస్టమిన్‌తో ఇది కంట్రోల్ అవుతుంది. అందుకే నారింజ, బొప్పాయి, నిమ్మ, కివి వంటి పండ్లు ఎక్కువగా తీసుకోవల్సి ఉంటుంది. లేదా యాంటీ హిస్టమిన్ ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక యాపిల్ మరో ముఖ్యమైన పండు. యాపిల్ సైడర్ వెనిగర్‌లో కేవలం ఎలర్జీని తగ్గించే గుణాలే కాకుండా...ఆరోగ్య సమస్యల్నించి ఉపశమనం కల్గించే గుణాలుంటాయి. ఎలర్జీ వల్ల కలిగే దురదను యాపిల్ సైడర్ వెనిగర్ నియంత్రిస్తుంది. ఇక అన్నింటికంటే ముఖ్యమైంది గోరువెచ్చని నీళ్లు. గోరు వెచ్చనినీళ్లలో కొద్దిగా ఉప్పు కలిపి..గొంతులో వేసుకుని పుక్కిలిస్తే సత్వర ఉపశమనం లభిస్తుంది. 


ఇక ఒమేగా- 3 పుష్కలంగా లభించే ఆహార పదార్థాలతో కూడా ఎలర్జీ తగ్గుతుంది. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా వాల్‌నట్స్, ఫిష్ ఆయిల్, అవిసె గింజలు, చేపలు, ఆకుకూరలు, గుడ్లు, చిక్కుడు గింజల్లో ఉంటాయి. 


Also read: Coconut Water: వేసవిలో కొబ్బరినీళ్లు తాగితే ఈ అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి