Health Tips To Reduce Body Heat: ఆధునిక జీవనశైలితో పలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాం. వీటితో పాటు కొన్ని చిన్న చిన్న సమస్యలు మనకు చికాకు తెప్పిస్తుంటాయి. అయితే అలాంటి విషయాలను అశ్రద్ధ చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నాయి. శరీరంలో అధిక వేడిమి వల్ల అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చేరవతున్నాయని గుర్తించాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మెదడులోని హైపోథాలమస్ శరీరంలోని వేడిని నియంత్రిస్తుంది. దీంతో పాటు మనం తీసుకునే ఆహారం, ఇతర అలవాట్లతో శరీరంలో అధిక వేడిని తగ్గించుకోవచ్చు. శరీరంలో అధిక వేడి ఉత్పన్నం అవడంతో తలనొప్పి(Headache), మలబద్దకం అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే వేడిని తగ్గించేందుకు కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించడం వల్ల సమస్యను అధిగమించవచ్చు.


Also Read: Effects Of Alcohol: మద్యం సేవించే సమయంలో ఈ పదార్ధాలు అసలు తినకూడదు


 


వేడిని తగ్గించేందుకు కొన్ని చిట్కాలు (Tips to Reduce Body Heat)


- తగినంత ఆక్సిజన్ అందే పరిస్థితి లేకపోతే శరీరంలో మార్పుల వల్ల బాడీ టెంపరేచర్ పెరిగినట్లు అనిపిస్తుంది. 


- అందుకే గాలి బాగా వచ్చే చోటనే కూర్చుని వర్క్ చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ఫ్యాన్, కూలర్ల వద్ద కొన్ని నిమిషాలు కూర్చుని సేదతీరాలి. 


- ఒకేచోట గంటల తరబడి కూర్చోవడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. దాని కారణంగా పైల్స్(Health Tips For Piles) సమస్య కూడా తలెత్తుతుంది. అందుకే కొద్దిసేపు కూర్చున్న తర్వాత లేచి అటూ ఇటూ తిరగాలి.


Also Read: Health Tips: పైల్స్ సమస్యను ఎదుర్కొనేందుకు Remedies For Piles పాటించండి



- మణికట్టు, ఛాతీ లాంటి బాగాల్లో చల్లని నీళ్లను, లేక ఐస్‌ను రాస్తే ఒక్కసారిగా ఉపశమనం లభిస్తుంది. 


- థైరాయిడ్ ఎక్కువ యాక్టివ్‌గా ఉంటే శరీరంలో అధిక వేడి ఉత్పన్నమవుతుంది. దీనివల్ల గుండె కొట్టుకునే వేగం సైతం పెరుగుతుంది, అధిక చెమట, జాండీస్ బారిన పడుతుంటారు. డాక్టర్‌ను సంప్రదించి వారి సలహాలు పాటించాలి. 


- శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు ఒంట్లో నీటి శాతం తగ్గడంతో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే తరచుగా నీళ్లు(Health Benefits Of Water), ఏదైనా ద్రావణాలను తాగాలి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుంది.


Also Read: Throat Pain: గొంతు నొప్పికి చెక్ పెట్టాలంటే ఈ Health Tips పాటించండి



- ఒక స్పూన్ మెంతుల్ని తినడంగానీ, లేకపోతే వాటిని పొడిగా చేసి నీళ్లలో కలుపుకుని తాగినా అధిక వేడి నుంచి మీకు ఉపశనమనం లభిస్తుంది.


- అప్పుడప్పుడు ఈత కొట్టడం (Swimming) వల్ల, అవసరమైతే రోజులో మరోసారి స్నానం చేయడం వల్ల ఉష్ణోగ్రత కొద్దిమేర తగ్గుతుంది.


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook