Do Not Eat This Fruit at Night: పండ్లు శరీరానికి ఎంతో మేలు చేయడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పండ్లలో అనేక రకాల విటమిన్లు ఉంటాయి. అందుకే అనారోగ్యంతో ఉన్నవారిని వైద్యులు పండ్లను తినమని సలహా ఇస్తారు. పండును సమయానికి అనుగుణంగా మాత్రమే తినాలని లేకుంటే అవి మీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట పండ్లను తీనడం వల్ల ఆరోగ్యానికి సమస్యలు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకు రాత్రిపూట పండ్లను తీనవొద్దని వైద్యులు పేర్కొన్నారు. రాత్రిపూట మీరు ఏయే పండ్లను తినకూడదో తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


రాత్రిపూట ఈ పండ్లను అస్సలే తినకూడదు:



అరటిపండు (Banana)


రాత్రిపూట తినకూడని పండ్లలో అరటిపండు ఒకటి. రాత్రి సమయంలో అరటిపండు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది వ్యాయామం తర్వాత సాయంత్రం అరటిపండ్లను తీంటూ ఉంటారు. అయితే దీనిని తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెంచుతుందని వైద్యులు తెలిపారు. దానివల్ల నిద్ర సమయంలో సమస్యలు వస్తాయని అంటున్నారు. అందుకే అరటిపండును రాత్రిపూట అస్సలు తినకూడదని తెలుపుతున్నారు.


సేపులు (Apple)


ప్రతి వైద్యుడు ఆపిల్ పండ్లను తినమని సలహా ఇస్తారు. రోజూ సేపులను తీనడం వల్ల శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పించడమే కాకుండా మంచి లాభాలను ఇస్తుంది. అయితే ఈ పండును రాత్రి పూట తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ రాత్రి పూట సేపును తీంటే సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందంటున్నారు. ఇది జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తుందని తెలుపుతున్నారు. కావున రాత్రి పూట దీనిని తీసుకోక పోవడమే మేలంటున్నారు.


సపోట (Sapodilla):


రాత్రిపూట సపోటాని కూడా తినోద్దని వైద్యులు తెలుపుతున్నారు. ఇందులో చక్కెర పరిమాణం అధికంగా ఉన్నందున శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. దీని కారణంగా నిద్రపోవడంలో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి రాత్రిపూట దీనిని తినోద్దని వైద్యులు తెలిపారు.



(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Health Tips: వారు టమోటాలను అస్సలే తినకూడదు..తింటే ప్రమాదమే..!!


Also Read: Kangana Ranaut Marriage: నాకు పెళ్లి అవ్వకపోవడానికి కారణం అదే!: కంగనా రనౌత్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.