Cholesterol Control Drinks: శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ.  అందుకే ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్‌ను నియంత్రించే చిట్కాలు (Cholesterol Control tips) పాటించాలి. ఇంట్లో ఉండే రెమిడీస్ తోనే మనం కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయవచ్చు. కొన్ని డ్రింక్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్ ఇట్టే కంట్రోల్ అయిపోతుంది. ఆ డ్రింక్స్ ఏంటో ఓ సారి చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రీన్ టీ (Green tea)
గ్రీన్-టీ బరువును తగ్గించడమే కాకుండా, కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది. దీనిని ప్రతిరోజూ తీసుకుంటే మీ సమస్యకు చెక్ పెట్టొచ్చు. 


టమోటా జ్యూస్ (Tomato juice)
టొమాటో జ్యూస్‌ తాగడం ద్వారా కూడా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. అయితే కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వ్యక్తులు ఈ జ్యూస్ తాగే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. 


ఓట్ మిల్క్‌ (Oat milk)
అంతేకాకుండా ఓట్ మిల్క్‌తో కూడా కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. వాస్తవానికి, ఇది బీటా-గ్లూకాన్ అనే పదార్థాన్ని కలిగి ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒక మంచి మరియు చెడు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ., కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మీరు మీ జీవనశైలిని మార్చుకోవాలి మరియు వ్యాయామం కూడా చేయాలి. 


Also Read: Dates With Milk: పాలలో ఖర్జూరం కలిపి తినడం దంపతులకు ఎంతో ప్రయోజనం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook