Natural Cleaning Tips: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే..అన్నింటి కంటే ముఖ్యమైంది కడుపు. కడుపు శుభ్రంగా ఉంటే ఏ విధమైన అనారోగ్య సమస్య వెంటాడదు. కడుపును క్లీన్‌గా ఉంచేందుకు కొన్ని సులభమైన చిట్కాలున్నాయి. ఆ వివరాల మీ కోసం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కడుపు శుభ్రంగా ఉంటే మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుందంటారు. ఎందుకంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. జీర్ణక్రియకు కావల్సింది హెల్తీ డైట్. పెద్ద ప్రేవులు శుభ్రంగా లేకపోతే పలు అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి. ఎందుకంటే ఎక్కువగా విష పదార్ధాలు పేరుకుపోయేది పెద్ద ప్రేవుల్లోనే. విష పదార్ధాలు పేరుకుపోవడం వల్ల చాలా వ్యాధులు తలెత్తుతాయి. అందుకే ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ మొత్తం ప్రక్రియకు మూలం శరీరం మెటబోలిజం. మెటబోలిజం సరిగ్గా ఉంటే అన్నీ బాగుంటాయి. కొన్ని సులభమైన చిట్కాలతో కడుపును క్లీన్ చేసుకోవచ్చు..


శరీరంలోని పెద్ద ప్రేవుల్ని శుభ్రంగా ఉంచేందుకు గోరు వెచ్చని నీరు చాలా ఉపయోగపడుతుంది. రోజూ ఉదయం వేళ కనీసం 2 గ్లాసుల గోరు వెచ్చని నీరు తాగాలి. ఇది కడుపును సహజసిద్ధంగా క్లీన్ చేయడంలో దోహదపడుతుంది. 


పాలతో కూడా పెద్ద ప్రేవుల్ని క్లీన్ చేయవచ్చు. రోజూ ఉదయం వేళల్లో బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ఒక గ్లాసు పాలు తప్పకుండా తాగాలి. పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుుంది. ఇది శరీరంలోని ఎముకల్ని పటిష్టం చేస్తుంది. 


కూరగాయల జ్యూస్ సేవించడం వల్ల కడుపు పూర్తిగా క్లీన్ అవుతుంది. శరీరంలోని వ్యర్ధాలు పూర్తిగా తొలగిపోతాయి. దీనికోసం కాకరకాయ, అల్లం, ఆనపకాయ, టొమాటో, పాలకూర జ్యూస్ తాగాల్సి ఉంటుంది. 


కడుపు క్లీనింగ్ కోసం మరో ముఖ్యమైంది హై ఫైబర్. ఫైబర్ పుష్కలంగా లభించే యాపిల్, బత్తాయి, కీరా, అల్లోవెరాను డైట్‌లో భాగంగా చేసుకోవాలి. ఫైబర్ పుష్కలంగా ఉంటే కడుపుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.


Also read: https://zeenews.india.com/telugu/health/health-precautions-and-tips-to-reduce-cholesterol-and-how-to-identify-cholesterol-76136



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook