Boiled Eggs: శరీరంలో ఎప్పుడు ప్రోటీన్ లోపమనేది లేకుండా చూసుకోవాలి. ప్రోటీన్ లోపాన్ని సరిదిద్దేందుకు గుడ్డు ఒక్కటే మంచి ప్రత్యామన్నాయం. అయితే పరిమితికి లోబడి తీసుకోవాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుడ్లు అనేవి ప్రోటీన్లకు మంచి సోర్స్ ఉన్న ఆహార పదార్ధం. అందుకే రోజూ ఒక గుడ్డు తినమని వైద్యులు సిఫారసు చేస్తుంటారు. గుడ్ల ద్వారా మన మజిల్స్ బలంగా తయారవుతాయి. రోజూ జిమ్‌లో వర్కవుట్ చేసేవాళ్లు..రోజుకో బాయిల్డ్ ఎగ్ తినేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే బాయిల్డ్ ఎగ్ పరిమితిలోనే తినాలి. ఎక్కువ తింటే అనర్ధాలు ఎదురౌతాయి.


ఉడకబెట్టిన గుడ్డుతో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. అందుకే మితంగా తినాలి. బాయిల్డ్ ఎగ్‌లో శరీరానికి కావల్సిన అన్ని న్యూట్రియంట్లు లభించవంటున్నారు. బాయిల్డ్ ఎగ్ తినేవాల్లు..బంగళాదుంప, బఠానీ, మక్కాలను దూరం పెడుతుంటారు. ఫలితంగా కీలకమైన పోషక గుణాలు లోపిస్తుంటాయి. అందుకే బాయిల్డ్ ఎగ్‌తో పాటు ఇతర ఆహార పదార్ధాలు తినడం మానేయకూడదు.


రోజుకు ఎన్ని బాయిల్డ్ ఎగ్స్


రోజూ జిమ్ చేస్తూ 2 బాయిల్డ్ ఎగ్స్ తింటే ఆరోగ్యానికి ఏ మాత్రం హానికరం కాదు. కానీ దీనితో పాటు ఇతర హెల్తీ ఫుడ్స్ కూడా తినాల్సి వస్తుంది. గుడ్లలో శాచ్యురేటెడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ కూడా ఉంటాయి. ఇవి గుండెకు, లివర్‌కు నష్టాన్ని చేకూరుస్తాయి. అందుకే అవసరానికి మించి ఎగ్స్ తినకూడదు. అవసరానికి మించి గుడ్లు తింటే గుండెపోటు మప్పుు అధికమౌతుంది. అందుకే మితంగానే తీసుకోవాలి.


Also read: Covid Cases Updates: లక్షకు చేరువలో యాక్టివ్ కేసులు.. ఐదు నెలల గరిష్టం.. భారత్ లో విజృంభిస్తున్న కొవిడ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.