Kidneys Care: మనిషి శరీరంలో వ్యవస్థ మొత్తం సక్రమంగా పనిచేయాలంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలి. మనిషి ఎదుర్కొనే అనారోగ్య సమస్యలైన స్థూలకాయం, రక్తపోటు, మధుమేహం వంటివి కిడ్నీలపై ప్రభావం చూపిస్తుంటాయి. కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, చెడు జీవన శైలి అనేది కిడ్నీల ఆరోగ్యాన్ని ప్రభావిం చేస్తుంటాయి. కిడ్నీలు తరచూ వైఫల్యం చెందడానికి ప్రధాన కారణమిదే. మనిషి శరీరంలో 60 శాతం ఉండేది నీరే కాబట్టి..రోజూ తప్పనిసరిగా తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి. మెదడు నుంచి లివర్ వరకూ అన్ని అవయవాలకు నీరు అవసరం. నీళ్లు రోజూ తగిన మోతాదులో తాగితేనే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలన్నా..సక్రమంగా పనిచేయాలన్నా తగినంత నీరు తాగాలి. శరీరంలో అన్ని రకాల ఫిల్టరేషన్‌లకు నీరు అవసరం.  నీళ్లు ఎక్కువగా తీసుకుంటే శరీరంలోని విష పదార్ధాలు మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి. మూత్రం పూర్తిగా రావడం లేదంటే కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని అర్ధం.


కిడ్నీలు ఆరోగ్యంగా పనిచేయాలంటే హైడ్రేంజ్ పూల టీ మంచి ప్రత్యామ్నాయం. ఇవి ఓ రకం పూలు. లావెండర్, గులాబీ, నీలం, తెలుపు రంగుల్లో ఉంటాయి. ఇందులో పెద్ద మొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల మూత్ర పిండాలు దెబ్బతినకుండా ఉంటాయి. మరోవైపు నిమ్మ, నారింజ, పుచ్చకాయ జ్యూస్ రోజూ తాగితే కిడ్నీలు ఎప్పటికప్పుడు క్లీన్ అవుతుంటాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలోని నీటి శాతాన్ని బ్యాలెన్స్ చేస్తుంది.


ద్రాక్షరసం, బెర్రీలు కూడా కిడ్నీల సంరక్షణకు అద్భుతంగా ఉపయోగపడతాయి. మూత్రపిండాల్ని నిర్విషీకరణ చేసేందుకు ఉపయోగపడతాయి. కిడ్నీల్లో మంట సమస్యను దూరం చేస్తుంది. ఇక క్రాన్ బెర్రీ జ్యూస్ అనేది మరో అద్భుతమైన పరిష్కారం. ఇందులో ఉండే పోషకాల కారణంగా యూటీ ఇన్‌ఫెక్షన్ సమస్యలు దూరమౌతాయి. కిడ్నీలు క్లీన్ అవుతాయి. 


Also read: Blue Tea: ఈ పూల టీతో బరువు తగ్గడమే కాదు.. తీవ్ర వ్యాధులకు కూడా చెక్‌ పెట్టొచ్చు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook