Heart Patients: ఇటీవలి కాలంలో ఎక్కువగా విన్పిస్తూ..తరచూ భయపెట్టే వార్త గుండెపోటు. గుండెపోటుతో బాధపడేవాళ్లు ఆ సమస్య నుంచి దూరంగా ఉండేందుకు కొన్ని ముఖ్యమైన సూచనలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. ఆ సూచనలేంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనిషి ఆరోగ్యంగా ఉంటే ఏ రోగమూ దరిచేరదు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి. ఆహారపు ఆలవాట్లే కాదు.జీవనశైలిలో కూడా మార్పు రావాలి. ముఖ్యంగా గుండె సంబంధిత రోగాలతో బాధపడేవాళ్లు కీలకంగా పాటించాల్సిన విషయం ఒకటుంది. అది సమయానికి నిద్రపోవడం. గుండె సంబంధిత రోగులు ఏ సమయానికి నిద్రపోవాలనే విషయంపై వైద్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..


మీ గుండెను ఫిట్‌గా ఉంచేందుకు మంచి నిద్ర చాలా అవసరం. ప్రతి రోజూ రాత్రి 10 గంటల వరకూ పడుకుంటే చాలామంచిదంటున్నారు వైద్యులు. గుండె సురక్షితంగా ఉండేందుకు ఇది సరైన సమయం. ఓ పరిశోధనలో 43, 79 ఏళ్ల మధ్య ఉన్న 88 వేలమందిని పరిశీలించారు. ఈ సందర్భంగా 88 వేలమంది పడుకునే సమయం, ఉదయం లేచే సమయాన్నిసేకరించి విశ్లేషించారు. అంతేకాకుండా వీరందరి జీవన శైలి ఆధారంగా పూర్తిగా పరిశీలించి ఈ అభిప్రాయానికొచ్చారు. ప్రతిరోజూ రాత్రి పది గంటల వరకూ నిద్రపోవాలని వైద్యులు సూచించారు.


క్రమబద్ధంగా లేని, చెడు ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా దేశంలో హార్ట్ ఎటాక్ ముప్పు పెరుగుతోంది. గుండెను ఫిట్‌గా ఉంటేందుకు తిండి ఒక్కటే కాదు..సరైన నిద్ర కూడా చాలా అవసరం. నిద్ర తక్కువైతే గుండె సంబంధిత రోగాలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా ఒబెసిటీ, టైప్ 2 డయాబెటిస్ చుట్టుకుంటాయి. అందుకే గుండెను ఎప్పుడూ ఫిట్‌గా ఉంచుకోవడం చాలా అవసరం.


Also read: lifestyle Diceases: ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పుతో..డయాబెటిస్, రక్తపోటుకు చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook