Heart Attack Symptoms: గుండెపోటు పోటు వచ్చే ముందు చాలా లక్షణాలు శరీరంలో ఉత్పన్నమవుతాయి. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనపోదడం చాలా కష్టమైనప్పటికీ ఈ లక్షణాలను పసిగట్టి సకాలంలో చికిత్స పొందడం చాలా మేలు లేకపోతే ప్రాణానికే ప్రమాదమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. హార్ట్ ఎటాక్ వచ్చే నెల ముందే మిమ్మల్ని హెచ్చరిస్తుంది. అయితే ఈ లక్షణాలను చాలా మంది తేలికగా తీసుకుంటున్నారు. అయితే శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఉదాహారాణకు ఆహారం జీర్ణం కాకపోవడం, గుండెల్లో మంటలు వంటి సమస్యలు ఉత్పన్నమైతే ఇది గుండె పోటుకు దారీ తీయోచ్చు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హార్వర్డ్ హెల్త్ రీసెర్చ్ ప్రకారం:
గుండెపోటు వచ్చే ముందు శరీరంలో చిన్నచిన్న సంకేతాలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే శరీరంలో పలు సాంకేతాలు వచ్చినప్పుడు వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది లేకపోతే ప్రాణాంతకంగా మారొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. హార్వర్డ్ హెల్త్  పరిశోధన ప్రకారం.. 95 మంది మహిళలు గుండెపోటుకు ఒక నెల ముందు శరీరంలో ఏదో ఒక లక్షణం వస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. ప్రజలు తరచుగా విస్మరించే రెండు అతి ముఖ్యమైన సంకేతాలు ఉన్నాయి. ఎప్పుడూ అలసటగా అనిపించడం, నిద్ర పట్టకపోవడం వంటివి కూడా..


గుండెపోటుకు ఒక నెల ముందు శరీరంపై ఈ లక్షణాలు వస్తాయి:
>>పరిశోధన ప్రకారం.. శ్వాస ఆడకపోవడం, బలహీనత, రాత్రి చెమటలు, తల తిరగడం, వాంతులు గుండెపోటు ప్రారంభ లక్షణాలు.
>>పురుషుల్లో ఛాతీ నొప్పి, బిగుతు, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు వస్తాయి.
>>'హార్వర్డ్ హెల్త్' పరిశోధన ప్రకారం.. 'కొందరు స్త్రీలు నిరంతరం అలసిపోతూ, కలత చెందుతూ, నిద్రపోతుంటే లేదా ఊపిరి పీల్చుకుంటూ ఉంటే, అది గుండెపోటు ప్రారంభ లక్షణం కావచ్చు.
>>హార్వర్డ్ హెల్త్ ప్రకారం.. ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, చల్లని చెమటలు, తల తిరగడం, వికారం వంటి లక్షణాలను ఎదుర్కొన్న మహిళలు వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. 


Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ పరుగుల దాహం తీరనిది.. మరో రికార్డుకు చేరువలో..   


Also Read: YSRCP MLA Tears: కన్నీళ్లు పెట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే.. కష్టాలు తెలుసుకుని భావోద్వేగం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook