Stomach Ache Could Be Symptom Of Heart Attack: ప్రస్తుతం కడుపునొప్పి సమస్యలతో బాధపడుతున్నవారు అధిక ఆమ్లత్వం లేదా గ్యాస్ కారణంగా వస్తున్నాయని వదిలేస్తారు. లేకపోతే మార్కెట్‌లో లభించే ట్యాబ్లెట్స్‌ వినియోగిస్తారు. ఇంకొందరైతే కొన్ని హోం రెమెడీస్‌ను వినియోగిస్తూ ఉంటారు. వీటి వల్ల సులభంగా ఉపశమనం పొందినా ఇది కొన్ని తీవ్ర వ్యాధులకు దారి తీసే అవకాశాలున్నాయి. తరచుగా కడుపు నొప్పి సమస్యలతో బాధపడేవారు ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా కడుపు నొప్పి రావడం వల్ల గుండెపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి గుండెను రక్షించుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిర్లక్ష్యం చేయకూడదు:
కడుపు నొప్పిలో చాలా రకాలు ఉన్నాయి. ప్రతి నొప్పి వివిధ సాంకేతాలను చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. నొప్పి అనేది సాధారణ రకం. దీనికి టోర్షన్ అని పేరు పెట్టారు. సాధారణంగా ఈ నొప్పి పేగుకు సంబంధించిన ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఈ రకమైన నొప్పితో కడుపులో ఏదో వేగంగా కదులుతున్నట్లు అనిపిస్తుంది. దానితో పాటు నొప్పి అనుభూతి కూడా ఉంటుంది. ఈ రకమైన నొప్పి సమయంలో విరేచనాలు కూడా వచ్చే అవకాశాలున్నాయి.


[[{"fid":"264112","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


కడుపు కుడి వైపున నొప్పి ఉంటే, నొప్పి నాభి దగ్గర కూడా అనిపిస్తుంది. ఇలాంటి నొప్పులతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించి, వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. కడుపు నుంచి నడుము వరకు తీవ్రమైన నొప్పిని ఉంటే పొట్ట రాళ్ల వల్ల వచ్చే ఛాన్స్‌ ఉంది. రాళ్ల నొప్పి తరచుగా సూది గుచ్చినట్లు అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి నొప్పులున్న తప్పకుండా వైద్యులను సంప్రదించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.


[[{"fid":"264111","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


కడుపు నొప్పి వల్ల గుండె సమస్యలు ఎలా వస్తాయి?:
 కడుపు పైభాగంలో నొప్పి ఉంటే, దానిని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కేవలం అసిడిటీ వల్లనే ఈ నొప్పి వస్తోందని అనుకుంటే అంతే సంగతి. ఇది మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ కూడా దారి తీసే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా గుండెకు కూడా ప్రభావింతం చేసే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆలస్యం చేయకుండా  ECG చేయించుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి కడుపు నొప్పులు వస్తే ఎప్పుడైనా గుండెపోటుకు దారి తీసే ఛాన్స్‌ ఉంది.


Also Read:  Anupama Parameswaran Saree pics : కొప్పున పూలెట్టుకొని.. అందమంటే అనుపమదేనా?.. చీరకట్టుకే కళ వచ్చిందా?


Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook