Heart Hole Symptoms: గుండెలో రంధ్రం. ఇటీవలి కాలంలో తరచూ విన్పిస్తున్న సమస్య. గుండెలో రంధ్రముంటే ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయి. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుండె సంబంధిత వ్యాధులు ఇటీవల అధికమౌతున్నాయి. సరైన అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుండె సంబంధిత వ్యాధుల్లో ముఖ్యమైంది గుండెలో రంధ్రం. ఈ సమస్యతో పుట్టుకతో వస్తుంది. సరైన సమయంలో గుర్తించగలిగితే వెంటనే చికిత్స ద్వారా నయం చేయవచ్చు. గుండెలో రంధ్రముంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయో చూద్దాం.


1.  గుండెలో రంధ్రముంటే వేడిగా ఉన్నా చలి వేయడం ప్రధానంగా కన్పిస్తుంది. వేసవిలో లేదా ఎండలో చలిగా ఉన్నట్టుంటే లేదా ఎప్పుడూ చలిగానే ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. గుండెలో రంధ్రముంటే ఇలాంటి లక్షణాలే ఉంటాయి.


2. తరచూ అలసటగా ఉండటం, ఎక్కువ చెమట్లు పట్టడం కూడా గుండెలో రంధ్రానికి లక్షణం. మీక్కూడా అలానే ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. 


3. మీకు తరచూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే నిమోనియా, గుండె వ్యాధులు, లేదా గుండెలో రంధ్రముండే అవకాశముంది. వెంటనే తగిన పరీక్షలతో నిర్ధారణ చేసుకోవాలి.


4. మాట్లాడేటప్పుడు లేదా నడుస్తున్నప్పుడు శ్వాస కష్టంగా ఉంటే గుండెలో రంధ్రముండేందుకు అవకాశముంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో మాట్లాడేటప్పుడు సమస్య ఎదురుకావడం ఇదే.


5. గుండెలో రంధ్రముంటే చిన్నారుల శరీరం రంగు నీలంగా మారుతుంది. ఈ సందర్భంగా పెదాలు, గోర్లపై ప్రభావం కన్పిస్తుంది. శరీరంలో ఇలాంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.


Also read: Diabetes Control Tips: ఓట్స్ పిండితో చేసిన రోటీలను తీసుకుంటే చాలు.. మధుమేహానికి గుడ్‌ బాయ్‌ చెప్పాల్సిందే..



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok