Raw Banana Benefits: పచ్చి అరటిపండును తినండి... ఈ వ్యాధులను దూరం చేయండి
Banana Benefits: అరటిపండు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే మీరు ఎప్పుడైనా పచ్చి అరటి పండు తిన్నారా? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం.
Raw Banana Eating Benefits: మీరు ఇప్పటి వరకు పండిన అరటిపండునే (Banana) తిని ఉంటారు. అయితే పచ్చి అరటిపండు తిని ఉండరు. అరటిపండు ప్రత్యేకత ఏంటంటే ప్రతి సీజన్‌లోనూ ఈ పండు మార్కెట్‌లో సులువుగా దొరుకుతుంది. దీనిని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది తింటారు. అరటిపండులో ఫైబర్స్ పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి చెడు కొవ్వు కణాలను, మలినాలను శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
రోజూ అరటిపండు తినడం వల్ల మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఫైబర్, విటమిన్-సి, విటమిన్-బి6, ప్రొవిటమిన్-ఎ, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్ వంటి ఎన్నో పోషకాలు పచ్చి అరటిపండులో (Raw Banana) ఉన్నాయి. ఈ పోషకాలన్నీ ఆరోగ్యకరమైన శరీరానికి ఎంతో ముఖ్యమైనవిగా పరగణిస్తారు. మీరు దీన్ని ఉడకబెట్టి, చిటికెడు ఉప్పుతో తినవచ్చు. దీని వల్ల మీ పొట్ట ఆరోగ్యం చాలా బాగుంటుంది.
Also Read: Diabetes Control Tips: మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండండి.. లేకపోతే అంతే..!
పచ్చి అరటిపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది
పచ్చి అరటిపండ్లలో ఫైబర్, రెసిస్టెంట్ స్టార్చ్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ జీర్ణవ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించడంతోపాటు ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహకరిస్తాయి.
2. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు
పచ్చి అరటిపండు తీసుకోవడం షుగర్ పేషెంట్‌కి మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ డయాబెటిక్ గుణాలు మధుమేహ సమస్యను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి.
3. గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది
పచ్చి అరటిపండు గుండెను (Heart) కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో అధిక మొత్తంలో పీచు లభిస్తుంది, ఇది పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను నియంత్రించగలదు.
4. ఊబకాయాన్ని నియంత్రిస్తుంది.
ఇది బరువు తగ్గడానికి (Weight Loss) కూడా ఉపయోగపడుతుంది. ఇందులో కొంత మొత్తంలో ఫైబర్ ఉంటుంది. దీనిని తక్కువ మెుత్తంలో తీసుకుంటే బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.
5. చర్మానికి మంచిది
పచ్చి అరటిపండ్లలో అనేక రకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖంపై ముడుతలను పోగొట్టడంలో సహాయపడతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook