High Cholesterol Sing On Face: ప్రస్తుతం చాలా మంది కొలెస్ట్రాల్ పెరిగి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వివిధ రకాల కలుషిత ఫుడ్‌ తినడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ పరిమాణంలో పెరిగితే గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అటువంటి పరిస్థితిలో.. శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే దాని లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసా.! . ముఖ్యంగా ఈ సమస్యలు వచ్చే ముందు శరీరం కొన్ని రకాల సంకేతాలను సూచిస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ముఖంలో ఈ మార్పులు వస్తాయి:


శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం ప్రారంభించినప్పుడు ముఖంలో కూడా మార్పులు వస్తాయి. ఈ సమస్యతో బాధపడుతుంటే.. చర్మం పసుపు, నారింజ రంగులోకి మారుతుంది. ఇలా చర్యం రంగు మారినప్పుడు అస్సలు విస్మరించకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది?:


ప్రస్తుతం మార్కెట్‌లో లభించే కొన్ని రకాల ఆహారాలను తినడం ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతుంది. అయితే ఈ ఫుడ్‌కు దూరంగా ఉంటేనే గుండెపోటు ప్రమాదం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పలు రకాల చిట్కాలను కూడా పాటించాలని వారు చెబుతున్నారు.


కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తాయి:


- ఛాతీ నొప్పి కూడా అధిక కొలెస్ట్రాల్ యొక్క లక్షణం.  


- ఊబకాయం కూడా  అధిక కొలెస్ట్రాల్ సమస్యకు ఒక లక్షణం. నిరంతరం బరువు పెరుగుతూ ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.


- పాదాలలో నొప్పిని కలిగి ఉంటే.. అప్రమత్తంగా ఉండండలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.  ఎందుకంటే ఇది అధిక కొలెస్ట్రాల్ ముఖ్య లక్షణమని వారు పేర్కొన్నారు.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Vitamin B12: విటమిన్ బి12 లోపం వల్ల ఈ సమస్యలు వస్తాయి..!


Also Read: Red Ants Home Remedies: తరచుగా ఇంట్లోకి ఎర్ర చీమలు వస్తున్నాయా.. ఇలా చేయండి..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 

 


 


 



 


 


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook