చెడు కొలెస్ట్రాల్..హార్ట్ ఎటాక్ వంటి వ్యాధులకు కారణమౌతుంది. గుండె సంబంధిత వ్యాధుల్నించి కాపాడుకోవాలంటే కొలెస్ట్రాల్ నియంత్రణ చాలా అవసరం. కొలెస్ట్రాల్ పెరగడంలో మన జీవవశైలి, చెడు ఆహారపు అలవాట్లు ప్రధాన కారణాలుగా ఉంటాయి. అందుకే డైట్‌లో కొన్ని హెల్తీ డ్రింక్స్ జోడిస్తే కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా హార్ట్ ఎటాక్ ముప్పు తగ్గించవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెడు కొలెస్ట్రాల్


కొలెస్ట్రాల్ అనేది నాళికల్లో పేరుకుపోయుంటుంది. ఇది రక్త సరఫరాను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా గుండె వరకూ రక్తం సరిగ్గా చేరదు. నాళికల్లో ఏర్పడే బ్లాకేజ్ కారణంగా గుండె పోటు సమస్య తలెత్తుతుంది. 


టొమాటో జ్యూస్


టొమాటో జ్యూస్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో కీలకంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే లైకోపీన్ చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా నియంత్రిస్తుంది. టొమాటోలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సెల్ డ్యామేజ్ నిరోధిస్తాయి. టొమాటోలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నియంత్రిస్తాయి.


అల్లం-వెల్లుల్లి రసం


అల్లం వెల్లుల్లి రసంలో ఉండే పోషక గుణాలు కొలెస్ట్రాల్ తగ్గించడంలో దోహదపడతాయి. అల్లం-వెల్లుల్లి మిక్సీ చేసి జ్యూస్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా నిమ్మరసం, తేనె, యాపిల్ వెనిగర్ కలపాలి. ఈ డ్రింక్ కొలెస్ట్రాల్‌ను చాలా వేగంగా తగ్గిస్తుంది. రోజుకు ఒక స్పూన్ తాగవచ్చు.


గ్రీన్ టీ


గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. గ్రీన్ టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. గ్రీన్ టీ గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ తగ్గించడంలో దోహదపడతాయి.


మెంతి నీరు


మెంతుల్లో ఉండే పోషక పదార్ధాలు గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తాయి. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మెంతుల్ని రాత్రి వేళ నానబెట్టి..ఉదయం నీళ్లతో సహా తీసుకోవాలి. లేదా మెంతుల్ని ఉడకబెట్టి గోరు వెచ్చని నీళ్లతో తీసుకున్నా మంచి ఫలితాలుంటాయి.


Also read: Anxiety and Panic Attack: యాంగ్జైటీ ఎటాక్, పానిక్ ఎటాక్‌లో అంతరం ఏంటి, ఎలా తెలుసుకోవడం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook