Honey Benefits and Tips: తేనెలో కొద్దిగా నిమ్మరసం, జీలకర్ర కలిపి తాగితే.. నెల రోజుల్లోనే స్థూలకాయానికి చెక్
Honey Health Tips: తేనె గురించి..తేనె లాభాల గురించి ఆయుర్వేద వైద్యశాస్త్రంలో చాలా విపులంగా ఉంది. అయితే తేనెను రోజూ ఎలా సేవిస్తామనేదానిని బట్టి ప్రయోజనాలుంటాయి. బరువు తగ్గేందుకు తేనె ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Honey Health Tips: తేనె గురించి..తేనె లాభాల గురించి ఆయుర్వేద వైద్యశాస్త్రంలో చాలా విపులంగా ఉంది. అయితే తేనెను రోజూ ఎలా సేవిస్తామనేదానిని బట్టి ప్రయోజనాలుంటాయి. బరువు తగ్గేందుకు తేనె ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
తేనెను ఆయుర్వేద శాస్త్రంలో భూమ్మీద లభించే అమృతంగా ప్రస్తావన ఉంది. నిజంగానే తేనె అంతటి మహత్యం కలిగింది. ప్రకృతిలో లభించే అద్భుతమైన ఔషధం తేనెతో ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయి. తేనెలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, విటమిన్ బీ6, కార్బోహైడ్రేట్స్, ఎమైనా యాసిడ్స్ వంటి పోషకాలు ఏ విధమైన ఇన్‌ఫెక్షన్‌ను దరిచేరనివ్వవు. శరీరానికి అంతగా రోగ నిరోధక శక్తిని అందిస్తాయి. ప్రతిరోజూ పరగడుపున తేనె సేవించడం వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గడం, జలుబు, జ్వరం వంటి ఇన్‌ఫెక్షన్లు దూరమవడం, ఇమ్యూనిటీ పెరగడం ఇలా చాలా రకాలుగా ప్రయోజనం కల్గిస్తుంది. గోరు వెచ్చని నీటిలో తేనె కలుపుకుని రోజూ పరగడుపున సేవిస్తుంటే..ఒత్తిడి దూరమౌతుంది.
గొంతు సంబంధిత సమస్యలు
ఏ రకమైన దగ్గునైనా తగ్గించేందుకు తేనె చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గొంతులో కఫాన్ని దూరం చేస్తాయి. ఫలితంగా దగ్గు కూడా తగ్గుతుంది. దీనికోసం రోజూ గోరు వెచ్చని నీటిలో తేనె కలుపుకుని సేవించాలి. చాలామందికి గొంతులో గరగర అధికంగా ఉంటుంది. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు పరగడుపున తేనెను వాము లేదా అల్లంతో కలిపి తీసుకుంటే మంచి ఫలితముంటుంది. గొంతులో గరగర తగ్గడమే కాకుండా కఫం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
పరగడుపున తేనెతో లాభాలు
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలనేది ప్రతి ఒక్కరి కోరిక. అందుకే వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. జిమ్‌కు వెళ్లడం, వాకింగ్, యోగా చేయడం, డైటింగ్ చేయడం ఇలా ఎన్నో పద్థతులు అవలంభిస్తుంటారు. కానీ ప్రతిరోజూ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తేనె కలుపుకుని పరగడుపున తాగితే సులభంగా బరువు తగ్గుతారు. ఇలా తాగడం వల్ల శరీరంలో పేరుకున్న కొవ్వు వేగంగా కరుగుతుంది. ఇందులో కొద్గిగా నిమ్మరసం లేదా జీలకర్ర పౌడర్ కలుపుకుంటే ఇంకా మంచిది.
అయితే మొక్కుబడికి వారం పదిరోజులు చేస్తే ప్రయోజనముండదు. క్రమం తప్పకుండా కనీసం నెలరోజులు చేస్తే ఫలితం కన్పిస్తుంది. ఆ తరువాత ఇదే పద్ధతిని మరి కొన్నేళ్లు కొనసాగించాలి. తేనె రోజూ తీసుకోవడం వల్ల ప్రయోజనమే తప్ప నష్టాల్లేవు.
Also read: Heart Attack Reasons: ముప్పై నలభై ఏళ్లకే గుండెపోటు ఎందుకొస్తోంది, కారణాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి