/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Heart Attack Reasons: మనిషి ప్రాణానికి సాక్ష్యం గుండె స్పందనే. ఆ గుండె కొట్టుకోవడం ఆగిందంటే ప్రాణం పోయినట్టే. గత కొన్నేళ్లుగా యుక్త వయస్సులోనే అంటే 30-40 ఏళ్లకే గుండె ఆగిపోతోంది. ఇంత చిన్న వయస్సులో గుండెపోటుకు కారణాలేంటి..

మనిషి ప్రాణం తెలిసేది గుండె చప్పుడుతోనే. ఆ చప్పుడు ఆగిందంటే ప్రాణం పోయినట్టే. అందుకే గుండెను ఎప్పుడూ పదిలంగా చూసుకోవాలి. గుండెపోటు రాకుండా ఉండాలంటే గుండె ఆరోగ్యం ముఖ్యం. ముఖ్యంగా డయాబెటిస్ రోగుల్లో గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటుంది. చెడు ఆహారపు అలవాట్ల కారణంగానే గుండె సమస్యలైనా, డయాబెటిస్ ముప్పైనా తలెత్తుతుంది. రెండూ ఒకదానికొకటి ప్రభావితమై ఉంటాయి. డయాబెటిస్ రోగుల్లో బ్లడ్ షుగర్ స్థాయి సరిగ్గా లేకపోతే..బ్లడ్ ప్లెషర్ పెరుగుతుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. 

30-45 ఏళ్లకు గుండెపోటు సమస్య ఎందుకు

ప్రస్తుతం చాలామందిలో 30-45 ఏళ్లకే గుండెపోటు సమస్యలు చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణం డయాబెటిస్ లేదా చెడు ఆహారపు అలవాట్లు లేదా రక్తపోటు. ఈ మూడు కూడా చెడు ఆహరపు అలవాట్ల కారణంగానే వస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే గుండెపోటు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. బ్లడ్ షుగర్ ఎక్కువైతే రక్తపోటుకు కారణమౌతుంది. అధిక రక్తపోటు గుండెపోటుకు దారితీస్తుంది. 

30 ఏళ్ల వయస్సు నుంచే చాలామంది ఒత్తిడికి లోనవుతుంటారు. ఒత్తిడి కారణంగా మనకు తెలియకుండానే బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిస్థితుల్లో స్మోకింగ్, మద్యం అలవాట్లుంటే గుండెపోటు సమస్య అధికమౌతుంది. డయాబెటిస్ ఉన్నప్పుడు గుండెపోటు ముప్పు నుంచి తప్పించుకోవాలంటే..బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండాలి. శరీర బరువు కూడా అదుపులో ఉండాలి. పరిమితంగా వ్యాయామం చేయాలి. గుండె ఆరోగ్యానికి కావల్సిన హెల్తీ ఫుడ్ తీసుకోవాలి.

కొలెస్ట్రాల్ పెరగడం

చెడు ఆహారపు అలవాట్ల కారణంగా 30-40 ఏళ్ల వయస్సుకే కొలెస్ట్రాల్ ప్రధాన సమస్యగా మారుతుంది. డయాబెటిస్ సమస్య లేకపోయినా..కొలెస్ట్రాల్ ఉంటే అది గుండెపోటుకు కారణం కాగలదు. కొలెస్ట్రాల్ నియంత్రణ చాలా అవసరం. మసాలా అధికంగా ఉన్న తిండికి దూరంగా ఉండాలి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే..బ్లడ్ క్లాట్స్ వచ్చి..హార్ట్ ఎటాక్‌కు దారి తీస్తుంది. 

Also read: Monsoon Healthy Diet: వర్షాకాలంలో కడుపు సంబంధిత సమస్యలకు ఇలా చెక్ పెట్టండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Health updates and tips to take care of heart, what is the reason behind in heart attacks among young people of 30-40 years age
News Source: 
Home Title: 

Heart Attack Reasons: ముప్పై నలభై ఏళ్లకే గుండెపోటు ఎందుకొస్తోంది, కారణాలేంటి

Heart Attack Reasons: ముప్పై నలభై ఏళ్లకే గుండెపోటు ఎందుకొస్తోంది, కారణాలేంటి
Caption: 
Heart attack in young people ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Heart Attack Reasons: ముప్పై నలభై ఏళ్లకే గుండెపోటు ఎందుకొస్తోంది, కారణాలేంటి
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Thursday, July 28, 2022 - 23:23
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
91
Is Breaking News: 
No