ఉడికిన గుడ్లు ఎంతలోపు తినాలి ?
గుడ్డు మధ్యతరగతి పోషకాహారం. దీని ఉడకబెట్టి తినాలా? లేక కూరగా చేసుకొని తినాలా? లేదా నూనెలో ఫ్రై చేసుకొని తినాలా? ఈ సందేహం అందరికీ వస్తుంది.
గుడ్డు మధ్యతరగతి పోషకాహారం. దీని ఉడకబెట్టి తినాలా? లేక కూరగా చేసుకొని తినాలా? లేదా నూనెలో ఫ్రై చేసుకొని తినాలా? ఈ సందేహం అందరికీ వస్తుంది. ఎలా తింటే మన ఆరోగ్యానికి శ్రేయస్కరం అంటే మాత్రం.. ఉడకబెట్టి తింటేనే లాభం అనేది అందరికీ తెలిసిందే..!
గుడ్లను ఉడకబెట్టి తింటే పోషకాలు అందుతాయి. అయితే గుడ్లను ఉడకబెట్టి చాలా మంది లేట్ గా తింటారు. వాస్తవానికి ఆలా చేయకూడదు. అలా చేస్తే గుడ్డుపై వైరస్, బ్యాక్టీరియాలు చేరి అవి త్వరగా కలుషితమయ్యే అవకాశం ఉంది. కనుక ఉడికించిన గుడ్లను ఎంతలోపు తినాలంటే..!
* నీళ్లలో ఉడికిన గుడ్లను ఒకపూట వరకు బయట ఉంచవచ్చు. కానీ పూట గడవక ముందే పొట్టు తీసి తినటం మంచిది.
* ఒకేవేళ ఇంట్లో ఫ్రిజ్ ఉన్నట్లయితే.. అందులో గుడ్లు పెట్టాలనుకుంటే పొట్టు తీయకుండా వారం రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. కానీ ఆ తరువాత తినేయాలి సుమీ..!
* ఒకవేళ ఫ్రిజ్ లో పొట్టు తీసి గుడ్లు పెట్టినట్లయితే.. మూడు, నాలుగు రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. అయితే ఉడికించిన గుడ్లను గాలి దూరని ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేస్తే గుడ్లు పాడవకుండా ఉంటాయి.