How To Burn Belly Fat In 15 Days: పెరుగుతున్న బరువును ఎంత తొందరగా తగ్గించుకుంటే అంత మంచిది. లేక పోతే తీవ్ర వ్యాధులు తలెత్తే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చాలా మంది బరువును తగ్గించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ బరువు తగ్గించుకోలేకపోతున్నారు. అయితే బరువుతో పాటు బెల్లీ ఫ్యాట్‌ను సులభంగా తగ్గించుకోవడానికి పలు రకాల సూపర్‌ డ్రింక్స్‌ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ చిట్కాను పాటిస్తే ఎలాంటి వ్యాయామాలు, శరీర సాధన లేకుండా సులభంగా బరువు తగ్గొచ్చు. అయితే ఈ సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి ఎలాంటి డ్రింక్స్‌ తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ డ్రింక్స్‌ తీసుకోండి:
ఆపిల్ సైడర్ వెనిగర్:
ఆపిల్ సైడర్ వెనిగర్ శరీరానికి చాలా రకాలుగా ఉపయోపగడుతుంది. ఎందుకంటే ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. యాపిల్ సైడర్ వెనిగర్ కొవ్వును తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఎసిటిక్ యాసిడ్‌ సమ్మేళనాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనిని డ్రింక్‌లా తీసుకుంటే సులభంగా బరువు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు ఆకలిని సులభంగా నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.


గ్రీన్ టీ:
గ్రీన్ టీకి హెల్తీ డ్రింక్ అని కూడా అంటారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. కాబట్టి ఈ టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీర బరువును సులభంగా తగ్గించి.. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గిస్తుంది. అయితే బరువును తగ్గించుకోవాలనుకునేవారు తప్పకుండా ఈ టీనికి రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవాల్సి ఉంటుంది.


బ్లాక్ కాఫీ:
బ్లాక్ కాఫీ తాగేందుకు చాలా మంది ఇష్టపడతారు. ఎందుకంటే ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. అయితే దీని ప్రతి రోజూ ఉదయం పూట తీసుకుంటే జీర్ణక్రియ రేటును పెంచి బరువును తగ్గించడానికి కృషి చేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఇలా ప్రతి రోజూ బ్లాక్‌ టీని తీసుకోండి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, నిపుణుల సలహా తీసుకోండి. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


Also Read : Vishnu Manchu Ginna Collections : జిన్నా పరిస్థితి మరీ దారుణంగా.. 50 షోలకు 49 టికెట్లు తెగాయా?


Also Read : Kantara 7 Days collection : ఏడురోజులకు ఐదురెట్ల లాభాలు.. ఆగని కాంతారా కాసుల వర్షం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook