Belly Fat Loss: బెల్లీ ఫ్యాట్‌ను సులభంగా కరిగించే పండ్లు ఇవే..
How To Burn Belly Fat With Fruits: బెల్లీ ఫ్యాట్ సమస్య కారణంగా తీవ్ర ఇబ్బందులు పడే వారు ప్రతి రోజు ఈ కింది పండ్లను డైట్ పద్ధతిలో తీసుకోవడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా తీవ్ర వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షిస్తాయి. కాబట్టి మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడితే తప్పకుండా ట్రై చేయండి..
How To Burn Belly Fat With Fruits: బెల్లీ ఫ్యాట్ కారణంగా చాలా మంది అందం కోల్పోతున్నారు. దీంతో పాటు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడుతున్నారు. నడుము, పొత్తి కడుపు చుట్టూ పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కారణంగా మధుమేహం, గుండెపోటు, ఇతక ప్రాణాంతక వ్యాధుల వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి వీలైనంత త్వరగా బెల్లీ ఫ్యాట్‌ను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించేకోవడానికి వ్యాయామాలతో పాటు పండ్లను డైట్ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజు తీసుకోవడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారు.
డైట్‌లో ఈ పండ్లు తప్పని సరి:
అరటి పండ్లు:
అరటి పండ్లు శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా పోషకాలను అందించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజు రెండు అరటి పండ్ల చొప్పున తీసుకుంటే శరీరానికి ఫైబర్ అధిక మోతాదులో అందుతుంది. ఇందులో తక్కువ పరిమాణంలో కేలరీలు కూడా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ సులభంగా తగ్గుతుంది.
దోసకాయ:
దోసకాయలో 95 శాతం నీరు లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల సులభంగా జీర్ణక్రియ మెరుగు పడుతుంది. బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు దోసకాయలను తీసుకోవడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. దీంతో పాటు శరీర బరువు కూడా తగ్గుతారు.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
నిమ్మకాయ రసం:
నిమ్మకాయ రసం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ శుభ్రం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ప్రతి రోజు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల పొట్ట ఉబ్బరం, బెల్లీ ఫ్యాట్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
బ్లూ బెర్రీస్:
బ్లూ బెర్రీస్‌లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా శరీరంలోని గ్లూకోజ్, కొవ్వు నిల్వలను తగ్గించేందుకు సహాయపడతాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీర బెల్లీ ఫ్యాట్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి