How To Control Diabetes: మధుమేహం తీవ్ర స్థాయికి చేరితే ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయి. అయితే భారత్‌లో రోజూ రోజూకు మధుమేహంతో బాధపడేవారి సంఖ్యంగా పెరుగుతుండడం విశేషం. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. అయితే ఈ మధుమేహం నియంత్రించాలంటే.. పలు రకాల ఆహారా నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రోజు వంటకాల్లో వాడే నిమ్మాకాయను కూడా మధుమేహాన్ని నియంత్రించేందుకు వినియోగించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ నిమ్మకాయలు మధుమేహాన్ని నియంత్రించడానికి ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిమ్మకాయలో ఈ లక్షణాలు ఉంటాయి:


నిమ్మకాయలో విటమిన్-ఎ, విటమిన్ సి, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రొటీన్లు వంటి పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా నిమ్మలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. నిమ్మకాయలో గ్లైసెమిక్ సూచికాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి దీనిని ఆహారంలో భాగంగా తీసుకుంటే సులభంగా మధుమేహం సమస్యలు దూరమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు.


రక్తంలో చక్కెర స్థాయిని ఎలా తగ్గిస్తుంది..?


శరీరంలో గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయి ఎక్కువైతే.. చక్కెర స్థాయి పెరుగుతుంది. కాబట్టి మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. నిమ్మకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు మధుమేహాన్ని నియంత్రిస్తాయి.


నిమ్మకాయను ఆహారంలో ఎలా తీసుకోవాలి:


>>భోజనానికి గంట ముందు ఒక గ్లాస్ లెమన్ వాటర్ తాగడం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది.
>>గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తింటే.. నిమ్మరసం తింటే మధుమేహం పెరగదు.


సలాడ్‌లో కూడా నిమ్మకాయ రసాన్ని తీసుకుంటే..శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి.


 


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: ఓటీటీకి సిద్దమైన 'కార్తికేయ‌ 2'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులోనో తెలుసా?


Also Read: షమీ, చహర్‌లకు షాక్.. డీకేకు చోటు! టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.