Vaccine Originality: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో ముమ్మరంగా కొనసాగుతోంది. అదే సమయంలో నకిలీ వ్యాక్సిన్ల బెడద ఆందోళన కల్గిస్తోంది. నకిలీ వ్యాక్సిన్లతో ఆరోగ్యానికి ముప్పున్న నేపధ్యంలో..ఆ వ్యాక్సిన్లను ఎలా గుర్తించాలనేది చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ నకిలీదా లేదా అసలా అనేది ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారిని(Corona Pandemic)అరికట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే ప్రస్తుతం మార్గంగా ఉంది. అందుకే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్(Corona Vaccination) ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఇదే అదనుగా నకీలీ వ్యాక్సిన్లు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్నాయి. నకిలీ వ్యాక్సిన్లతో అసలుకే మోసం ఏర్పడి..ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే ప్రమాదముంది. ఇప్పటికే ఆసియా, ఆప్రికా దేశాల్లో నకిలీ కోవిడ్ వ్యాక్సిన్లను గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)వెల్లడించింది. అసలు వ్యాక్సిన్ ఎలా గుర్తించాలనే విషయాల్ని కేంద్ర ఆరోగ్యశాఖ(Union Health Ministry)సూచిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వి వ్యాక్సిన్లతో వ్యాక్సినేషన్ జరుగుతోంది. అసలు వ్యాక్సిన్ ఏది, నకిలీ ఏదనే విషయాన్ని ఎలా గుర్తించాలో పరిశీలిద్దాం.


కోవిషీల్డ్ (Covishield)విషయంలో లేబుల్ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. వయల్‌పై అల్యూమినియం మూత పైభాగం కూడా ఇదే రంగులో ఉంటుంది. ట్రేడ్‌మార్క్‌తో సహా కోవిషీల్డ్ బ్రాండ్‌నేమ్ స్పష్టంగా కన్పిస్తుంది. జనరిక్ పేరు బోల్డ్ అక్షరాల్లో కన్పిస్తుంటుంది. సీజీఎస్ నాట్ ఫర్ సేల్ అని ముద్రించి ఉంటే అసలైనదిగా గుర్తించాల్సి ఉంటుంది. వయల్‌పై లేబుల్  ఉన్న చోట ఎస్ఐఐ లోగో నిట్ట నిలువగా కాకుండా కాస్త వంపుతో ఉంటుంది. ఇక లేబుల్‌పై కొన్ని అక్షరాల్ని తెల్లసిరాతో ముద్రించారు. మొత్తం లేబుల్‌పై తెనెపట్టు లాంటి చిత్రం ఓ ప్రత్యేకమైన కోణంలో చూస్తే కన్పిస్తుంది. 


ఇక కోవాగ్జిన్‌ను(Covaxin)ఎలా గుర్తించాలో కూడా కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు జారీ చేసింది. లేబుల్‌పై డీఎన్ఏ నిర్మాణం వంటి చిత్రం అతి నీలలోహిత కాంతిలో స్పష్టంగా కన్పిస్తుంది. లేబుల్‌పై సూక్ష్మమైన చుక్కలతో కోవాగ్జిన్ అని రాసి ఉంటుంది. కోవాగ్జిన్ రాసి ఉన్న హోలోగ్రామ్ కూడా గమనించవచ్చు.


Also read: Home Remedies for Platelets: ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నాయా..! ప్లేట్‌లెట్స్ కౌంట్ పెంచే చిట్కాలు మీకోసం..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook