How To Get Good Sleep: గాఢమైన నిద్ర ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్ర పోతే ఉదయం చాలా తాజా మూడ్‌తో మేల్కొంటారు. అందంతో పాటు మానసిక, శారీరక ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. అయితే చాలా మంది కలల వల్ల, దాహం అవ్వడం వల్ల సరిగా నిద్రపోరు. ఇలాంటి సమస్యల కోసం పలు రకాల ఆహారాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంచి నిద్ర కోసం ఏం చేయాలి?:


రాత్రి బాగా నిద్రపోవాలంటే అరటిపండు, దాల్చిన చెక్కతో చేసిన టీని నిద్రపోవడానికి గంట ముందు తీసుకోండి. ఈ టీ చేయడానికి కావాల్సిన పదార్థాలు..


- ఒకటిన్నర కప్పు నీరు
- 1 అరటిపండు
- 1 స్పూన్ దాల్చినచెక్క


ఈ టీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..


1. అరటి పండును కడిగి శుభ్రం చేసి, తొక్కతో సహా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.


2. ఇప్పుడు ఈ ముక్కలను టీ చేయడానికి పాత్రలో ఉంచండి.


3. అందులో ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని వేయండి.


4. ఇప్పుడు పై నుంచి ఒకటిన్నర కప్పు నీరు పోసి ఈ మిశ్రమాన్ని చాలా తక్కువ మంట మీద 10 నిమిషాలు ఉడికించాలి.


5. దీన్ని జల్లెడ సహాయంతో వడపోసి సిప్ బై సిప్ తాగాలి.


6. నిద్రకు ఒక గంట ముందు తాగడం వల్ల రాత్రి పడుకునేటప్పుడు మూత్రం రాదు. కాబట్టి నిద్రవేళకు ముందు ఫ్రెష్ అప్ అయ్యేలా చేస్తుంది.


అరటిపండు నిద్రపోవడానికి సహాయపడుతుంది:


అరటిపండులో అమినో యాసిడ్, ట్రిఫోటాన్, రిలాక్సేషన్ అనే లక్షణాలుంటాయి. వాటి వినియోగం మెదడులో సెరోటోనిన్ స్రావాన్ని పెంచడానికి దారితీస్తుంది. సెరటోనిన్ అనేది రిలాక్సింగ్ హార్మోన్, ఇది మెదడును ప్రశాంతపరుస్తుంది. అరటిపండు తీసుకోవడం వల్ల శరీరంలో కార్టిసాల్ ఉత్పత్తి తగ్గిపోతుంది. కార్టిసాల్ అనేది హానికరమైన హార్మోన్. ఇది శరీరం, మెదడులో ఒత్తిడిని పెంచుతుంది.



దాల్చినచెక్కలో ఉండే గుణాలు:


దాల్చినచెక్క ఒక ఆయుర్వేద ఔషధం. అందుకే వీటిని అనేక వ్యాధులకు, చికిత్సలలో వినియోగిస్తారు. కాబట్టి రాత్రిపూట సరిగ్గా నిద్రపోని వారు దాల్చిన చెక్కతో చేసిన టీని తీసుకోవాలని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నారు.


Also Read: Benefits of Mushrooms: మష్రూమ్స్‌ వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?


Also Read: Belly Fat: పొట్ట చుట్టూ కొవ్వు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ పని చేయండి..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 



 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.