Belly Fat: పొట్ట చుట్టూ కొవ్వు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ పని చేయండి..!

Belly Fat: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది బొడ్డు చుట్టు కొవ్వు సమస్యలతో బాధపడుతున్నారు.  దీని నుంచి విముక్తి పొందడానికి చాలా రకాల వ్యాయమాలు చేస్తూ ఉంటారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 10, 2022, 03:44 PM IST
  • పొట్ట చుట్టు కొవ్వు సమస్యతో బాధపడుతున్నారా..
  • మేడి పండ్లు బరువును తగ్గిస్తాయి
  • పొట్టచుట్టూ కొవ్వును వేగంగా తగ్గిస్తుంది
Belly Fat: పొట్ట చుట్టూ కొవ్వు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ పని చేయండి..!

Belly Fat: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది బొడ్డు చుట్టు కొవ్వు సమస్యలతో బాధపడుతున్నారు.  దీని నుంచి విముక్తి పొందడానికి చాలా రకాల వ్యాయమాలు చేస్తూ ఉంటారు. కానీ ఈ వర్క్‌ అవుట్స్‌ వల్ల ఆశీంచిన ఫలితాలను పొందలేకపోతున్నారు. ఈ కొలస్ట్రాల్ నుంచి ఉపశమనం పొందడానికి రోజు తినే ఆహారంలో మంచి పోషక విలువలున్న ఫుడ్‌ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ ఫుడ్‌ ఎమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

మేడి పండ్లు బరువు తగ్గించడానికి సహాయపడుతుంది:

పొట్ట చుట్టూ కొవ్వు సమస్యతో బాధపడుతుంటే క్రమం తప్పకుండా మేడి పండ్లను తీసుకోవాలని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొంది. ఇందులో ఐరన్, కాల్షియం, విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కావున ఇది శరీర బారువును తగ్గిస్తుంది.

మేడి పండ్ల ప్రయోజనాలు:

1. ఉదయాన్నే నిద్రలేచి ఖాళీ కడుపుతో మేడి పండ్లను తింటే..ఇది చడానికి సహాయపడుతుంది.

2. మేడి పండ్లలో ఫిజిన్ అనే డైజెస్టివ్ ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా బరువును కూడా వేగంగా తగ్గిస్తుంది.

3. ఈ పండు వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందలనుకుంటే.. నానబెట్టి తినాలని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా  చేస్తుంది.

4. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన ఈ పండ్లను తింటే..ఫ్యాటీ యాసిడ్ కేలరీలను బర్న్ చేయడానికి కృషి చేస్తుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Monsoon Health Tips: వాన కాలం తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించాలి.. లేక పోతే ఈ వ్యాధులు తప్పవు..!

Also Read: How To Eat Cucumber: దోసకాయ పొట్టు తీయకుండా తింటే అనేక ప్రయోజనాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News