How To Loss Weight: అనారోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజు తినడం వల్ల చాలా మందిలో కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరుగుతున్నాయి. చివరకు ఊబకాయం బారి పడుతున్నారు. ఈ రెండు సమస్యలు చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటి కారణంగా గుండెపోటు వచ్చే ఛాన్స్‌ కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా పల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి రోజు డైట్‌ను పాటించి జిమ్‌ చేయడం వల్ల కూడా శరీర బరువును నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ కింది చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ చిట్కాలతో శరీర బరువుకు చెక్‌!
ప్రోటీన్ షేక్ తప్పని సరిగా తీసుకోవాల్సి ఉంటుంది:

ప్రస్తుతం చాలా మంది నిద్రపోయే ముందు కూల్‌డ్రింక్స్‌ ఎక్కువగా తాగుతూ ఉంటారు. అయితే ఇలాంటి డ్రింక్స్‌కి బదులుగా బరువు తగ్గే క్రమంలో నిద్రపోయే ముందు ప్రోటీన్ షేక్ తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోదగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ప్రోటీన్ కార్బోహైడ్రేట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి సులభంగా కేలరీలను జీర్ణం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో బరువు తగ్గుతారు.


Also read: BRS MLA Gampa Govardhan: రైస్ మిల్లు సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్


బరువు తగ్గాలంటే నిద్రపోవాల్సిందే:
బరువు తగ్గే క్రమంలో తప్పకుండా శరీరానికి మంచి నిద్ర కావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవడం చాలా మంచిది. అంతేకాకుండా నిద్రపోయే ముందు కేవలం లైట్‌ ఫుడ్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. 


స్లీప్ మాస్క్:
స్లీప్ మాస్క్ వేసుకుని నిద్రపోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. బరువు తగ్గాలనుకునేవారు వెలుతురులో నిద్రపోయే బదులుగా స్లీప్ మాస్క్ వేసుకుని నిద్రపోవడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందొచ్చు. అంతేకాకుండా దీనిని ధరించి నిద్రపోవడం వల్ల నిద్రలేమి సమస్యలు దూరమవుతాయి.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also read: BRS MLA Gampa Govardhan: రైస్ మిల్లు సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook