Weight Loss Diet Plan: బరువు తగ్గే క్రమంలో మూడు పూటలు ఇలా చేయండి.. కేవలం 20 రోజుల్లో చెక్ పెట్టొచ్చు..
How To Lose Weight In 20 Days: బరువు తగ్గడం అంత తేలికైన పని కాదు. బరువు తగ్గడం, పెరగడం రెండు ఎంతో కఠిన శ్రమతో కూడుకుని ఉంటాయి. అయితే ప్రస్తుతం ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. బరువు తగ్గడానికి చాలా రకాల ప్రయత్నాలు చేసిన బరువు తగ్గలేకపోతున్నారు.
How To Lose Weight In 20 Days: బరువు తగ్గడం అంత తేలికైన పని కాదు. బరువు తగ్గడం, పెరగడం రెండు ఎంతో కఠిన శ్రమతో కూడుకుని ఉంటాయి. అయితే ప్రస్తుతం ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. బరువు తగ్గడానికి చాలా రకాల ప్రయత్నాలు చేసిన బరువు తగ్గలేకపోతున్నారు. అయితే తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్ల బరువు పెరగడం వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనుసరిస్తున్న ఆధునిక జీవన శైలిలో కూడా పలు రకాల మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే బరువు తగ్గడానికి ప్రత్యేకమైన డైట్ ప్రణాళికను కూడా అనుసరించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల కేవలం 20 రోజుల్లో బరువు తగ్గొచ్చు. అయితే ఈ డైట్‌లో ఎలాంటి నియమాలు పాటించాల్సి ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
అల్పాహారంలో కేవలం వీటిని మాత్రమే ఆహారంగా తీసుకోవాలి:
బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ ఉదయం పూట దోసకాయ-నిమ్మకాయతో తయారు చేసిన రసాన్ని తీసుకోవాలి. దీన్ని తాగడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరమవుతాయి. ఒక గ్లాసులో దోసకాయ రసం వేసుకుని.. ఆపై నిమ్మరసం వేసి తీసుకోవాలి. అయితే దీనిని తీసుకున్న తర్వాత గ్రీన్ టీ తాగాలి. ఆ తర్వాత ఉదయం 11 గంటల ప్రాంతంలో స్పైసీ టీ తాగండి. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు.
భోజన సమయంలో ఇవి తీసుకోండి:
బరువు తగ్గాలనుకునేవారు మధ్యాహ్న భోజనంలో కేలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. దీని కోసం ఓట్స్ రోటీని లేదా ఓట్స్‌తో తయారు చేసిన వివిధ రకాల ఆహారాలను తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇదే క్రమంలో పెరుగుతో చేసిన సలాడ్‌ను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. భోజనం చేసిన 2 గంటల తర్వాత కొబ్బరి నీళ్లు తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సులభంగా కేలరీలను బర్న్ అవుతాయి.
రాత్రి భోజనానికి వీటిని ఆహారంగా తీసుకోవాలి:
రాత్రి భోజనంలో కూరగాయల సూప్‌ను తాగవచ్చు. దీనితో పాటు బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్, నేవీ బీన్స్ కూడా ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. బరువు తగ్గడానికి బీన్స్ తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆహారంలో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి సులభంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook