Instant Punugulu Recipe: పునుగులను మనం ప్రతీ వీధుల్లో చూడవచ్చు. ఈ పునుగులు ఏపీ నుంచి వచ్చని ఒక సాంప్రదాయ డీప్ ఫ్రైడ్‌ స్నాక్‌ అని చ చాలా మంది చెబుతుంటారు . పప్పు, బియ్యాన్ని ఉపయోగించి ఈ స్నాక్స్‌ను తయారు చేస్తారు. అయితే మీరు కూడా ఈ పునుగులను మీ ఇంట్లో ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. చిన్న పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. వీటిలో కొన్ని రుచికరమైన , ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు కలుపుకోవడం వల్ల ఎలాంటి సమస్యల బారిన పడాల్సిన అవసరం ఉండదు. అంతుకాకుండా పునుగులలో జీలక్రర వేసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పిల్లలు దీని తినడం వల్ల ఆరోగ్యం ఉంటారు. మీకు నచ్చితే అల్లం ముక్కులు కూడా ఇందులో కలుపుకొని తినడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. అల్లంలో ఉండే అనేక పోషకాలు మీకు అందుతాయి. నూనెను కావాల్సిన పరిమాణంలో ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
 
కావాల్సిన పదార్థాలు:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇడ్లీ, దోస పిండి - 2 కప్పుల


బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్లు 


రుచికి ఉప్పు


నూనె అవసరమైనంత డీప్ ఫ్రై చేయడానికి


పచ్చిమిర్చి ముక్కలు - 2


తరిగిన ఉల్లిపాయ - ¼ కప్పు


జీలకర్ర - ½ టీస్పూన్


పునుగులు ఎలా తయారు చేసుకోవాలి: 


ముందుగా రెండు కప్పుల ఇడ్లీ, దోస పిండి  తీసుకోవాలి. ఈ పిండిలో టీ స్పూన్‌ జీలక్రర, రెండు పచ్చి మిరపకాయలు కలుపుకోవాలి. మూడు టేబుల్‌ స్పూన్లు నీరు కలుపుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి మార్చండి. డీప్ ఫ్రై కోసం కడాయిలో నూనె వేడి చేసుకోండి. పిండిని గుండ్రంగా చేసి వేడి నూనెలో వదలండి. కొన్ని నిమిషాల తర్వాత  బంగారు రంగు, క్రిస్ప్ వరకు వాటిని వేయించాలి. ఇలా తయారు చేసుకున్న పునుగులను కొబ్బరి చట్నీ , అల్లం చట్నీతో తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter