Coconut Rice Recipe: పూజలు, వ్రతాలు జరిగినప్పుడు కొబ్బరికాయలు ఎక్కువగా ఉపయోగిస్తాం. కొబ్బరి, బెల్లం కలిపి కూడా తింటూ ఉంటాం. కానీ పచ్చి కొబ్బరిని కలిపి రైస్ కూడా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి రైస్ ఎంతో రుచికరంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొబ్బరి రైస్ తయారుకి కావాల్సిన పదార్థాలు:


బియ్యం, కొబ్బరి పాలు, ఉప్పు, నూనె, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీకర్ర, ఎండుమిర్చి, మిరియాలు, జీడిపప్పు పలుకులు, తరిగిన పచ్చిమిర్చి, 
కరివేపాకు, ఇంగువ, పచ్చికొబ్బరి తరుము 


తయారు చేసుకోండి ఇలా:


ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడగాలి.  కుక్కర్లో వేసి పాలు, ఉప్పు, నూనె వేసి ఉడకించాలి. ఇలా రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఆ తరువాత అన్నాన్ని పొడి పొడిగా చేసుకొని రెడీగా ఉంచుకోవాలి.  ఒక కుళాయి తీసుకొని అందులో నెయ్యి వేడి చేయాలి. ఆ తరువాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. 


ఆ తరువాత మిరియాలు, జీడిపప్పు పలుకులు, పచ్చిమిర్చి,కరివేపాకు వేసి వేయించుకోవాలి. చివరిగా ఇంగువ, పచ్చికొబ్బరి తరుము వేసి  కలుపుతూ వేయించాలి. ఆ తరువాత వేడి వేడిగా కొబ్బరి రైస్ రెడీ అవుతుంది. 


Also Read Appetite Boosting Foods: పిల్లల్లో ఆకలి కలిగించే ఆహార పదార్ధాలు ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter