Immunity Diet: రోగనిరోధక శక్తిని పెంచే దోసకాయ జ్యూస్
Cucumber Juice Benefits: సీజన్స్‌తో పని లేకుండా ఏడాది పొడుగున లభించే కీరా ( దోసకాయ) ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలిగిస్తుంది. జీవక్రయ ( Metabolism) ను పెంచుతుంది. ఎముకలను ( Stregthen Bones )బలపరుస్తుంది. ఇందులో విటమిన్-సి, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆడ్సిటెంట్లు మెండుగా ఉంటాయి.
Cucumber Juice Benefits: సీజన్స్‌తో పని లేకుండా ఏడాది పొడుగున లభించే కీరా ( దోసకాయ) ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలిగిస్తుంది. జీవక్రయ ( Metabolism) ను పెంచుతుంది. ఎముకలను ( Stregthen Bones ) బలపరుస్తుంది. ఇందులో విటమిన్-సి, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆడ్సిటెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో ప్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. అదే విధంగా బరువుతగ్గాలని అనుకునే వారికి, స్లిమ్ ( Slim ) అవ్వాలని కోరుకునే వారికి దోసకాయ మంచి ఛాయిస్. Also Read : అతి వేగంగా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు
దోసకాయను తొక్కతో పాటు తినడం వల్ల ఎముకలకు మేలు జరుగుతుంది. దోసకాయ తొక్కలో సిలికా అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను పటిష్టం చేస్తుంది. అందుకే దోసకాయ జ్యూస్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
How To Prepare Cucumber Juice: కీరా జ్యూస్ తయారీకి కావాల్సినవి
పెద్ద దోసకాయ ( Cucumeber ) తరిగినవి -1
నిమ్మకాయ ( Lemon ) -1
పుదీనా ఆకులు ( Mint Leaves ) - 8-10
జీలకర్ర ( Jeera )-2
నల్ల మిరియాలు ( Black Pepper ) - 3-4
అల్లం ( Ginger )- చిన్న ముక్క
ఉప్పు ( Salt ) - తగినంత
కీరా జ్యూస్ చేయడం
దోసకాయ రసం చేయడానికి ముందు మిక్సర్ గ్రైండర్‌లో దోసకాయ ముక్కలు, అల్లం, నిమ్మరసం , పుదీనా ఆకులు, జీలకర్ర, నల్ల మిరియాలు వేసి బాగా రుబ్బుకోవాలి. తరువాత ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ ( Ice Cubes ) వేసి సర్వ్ చేయండి. కీరా దోసకాయ జ్యూస్‌ను ప్రతీ రోజు తాగడం వల్ల రోగనిరోధక శక్తి ( Immunity ) మెరుగు అవుతుంది.
How To Become Slim: స్లిమ్ అవ్వాలి అనుకుంటే ఈ చిట్కాలు పాటించండి