COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Protein Powder At Home:  బ్రేక్‌ఫాస్ట్‌కి బదులుగా ప్రోటీన్ పౌడర్‌ను  రెగ్యులర్‌గా  తీసుకుంటారు చాలా మంది. దీని తీసుకోవడం వల్ల బాడీ ఫిట్‌గా  ఉంటుంది. ఈ ప్రోటీన్ పౌడర్లు మార్కెట్‌లో వివిధ రకాలు అమ్ముతుంటారు. వీటిని వెనిలా, చాక్లెట్‌, రోజ్‌ అనే ఫ్లేవర్‌తో  మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ పౌడర్‌ రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ ఖరీదై పౌడర్లు కొనుగోలు చేయడం చాలా కష్టం. కాబట్టి మనమే దీని సొంతంగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. దీని కోసం ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసే అవసరం లేదు. 


ప్రోటీన్ పౌడర్ అంటే ?


ప్రోటీన్‌ పౌడర్లు మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. దీని తీసుకోవడం వల్ల కండరాలను దృఢంగా తయారు అవుతాయి. ఇది ఒక ఇమ్యూనిటి బూస్టర్ అని చెప్పవచ్చు.  ఈ ప్రోటీన్ పౌడర్ ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.


 ప్రోటీన్ పౌడర్‌లో కేవలం ప్రోటీన్ మాత్రమే కాకుండా ఫైబర్‌ కూడా అధికంగా ఉంటుంది. ఈ పౌడర్‌ కండరాలను బలంగా తయారు చేయడంలో సహాయపడుతుంది. 


ప్రోటీన్ పౌడర్‌కు కావాల్సిన పదార్థాలు: 


బాదంపప్పులు ½ కప్పు, పల్లీలు ½ కప్పు, ఎండుద్రాక్ష మూడు టేబుల్‌ స్పూన్‌లు, పిస్తా ½ కప్పు, ఖర్జూరం మూడు, వాల్ నట్స్‌ ½ కప్పు, జీడిపప్పులు ½ కప్పు, మెలోన్ సీడ్స్ ½ కప్పు,  నువ్వులు మూడు టేబుల్ స్పూన్లు, అత్తి పండు మూడు టేబుల్ స్పూన్లు, పొద్దుతిరుగుడు విత్తనాలు మూడు స్పూన్ల్‌, అర చెంచా యాలకులు,  ఒక స్పూన్‌ సోంపు, కుంకుమపుప్వు, నెయ్యి 


Also Read  Drumstick Leaves Water: పరగడుపున మునగాకు నీరు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఇవే!


ప్రోటీన్ పౌడర్ తయారు చేయడం ఎలా: 


ముందుగా పాన్ తీసుకొని నెయ్యి వేడి వేడిచేయాలి. ఇందులోకి బాదం, శనగపప్పు, పిస్తా వేయించాలి. తర్వాత ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి. అలాగే అత్తి పండు ముక్కలు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో అన్ని ఫ్రూట్స్‌ను పౌండర్‌గా తయారు చేసుకోవాలి. రెండు సార్లలు గ్రైండ్‌ చేసుకోవాలి.  ఈ పొడిని ఒక ప్లేట్‌లో తీసుకోవాలి. దీని ప్రతిరోజు పాలలో కలుపుకొని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.


Also Read Cardamom Health Facts: యాలకుల గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆరోగ్య రహస్యాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter