Drumstick Leaves Water: పరగడుపున మునగాకు నీరు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఇవే!

Drumstick Leaves Water uses: మునగాకు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  మునగ ఆకును ఔషధ గుణాల కోసం కూడా ఉపయోగిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2024, 10:54 AM IST
Drumstick Leaves Water: పరగడుపున మునగాకు నీరు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఇవే!

Drumstick Leaves Water uses: మునగ ఆకును శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో ఔషధంగా ఉపయోగించేవారు. దీని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్‌ను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. 

మునగాకులో విటమిన్‌లు, మినరల్స్‌, యాంటీఆక్సిడెంట్లలు పుష్కలంగా లభిస్తాయి. ఆరోగ్య సమస్యలకు కూడా తగ్గించడంలో ఈ మునగాకు ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు మునగాకు జ్యూస్‌ తీసుకోవడం వల్ల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి.

దీని పరగడుపున తీసుకోవడం వల్ల అధిక బరువు, షుగర్‌ లెవెల్స్ అదుపు చేయడంలో ఎంతో సహాయపడుతుంది. మునగాకు జ్యూస్‌ తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం..

శరీరంలోని టాక్సిన్స్ తొలగించడంలో:

శరీరంలోని టాక్సిన్‌ను తొలగించడంలో మునగ ఆకు నీళ్లు ఎంతో సహాయపడుతాయి. శరీరంలోని టాక్సిన్స్‌ తొలగించడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచాల మునగాకు పొడిని తీసుకొని ఖాళీ కడుపుతో ఈ నీళ్ళు తాగాలి. ఇలా చేయడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. 

అధిక బరువు సమస్య నుంచి విముక్తి:

ప్రస్తుతం చాలా మందిని వేధించే సమస్యలో అధిక బరువు ఒకటి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అంటే ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో మునగ ఆకు నీటిని తాగాలి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరడంతో పాటు బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. 

జీవక్రియను మెరుగుపరచడంలో:

వయసుతో సంబంధ లేకుండా చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయట పడాలి అంటే మునగాకు నీరు ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. 

విటమిన్‌లు అందించడంలో:

మునగాకులో యాంటీ ఆక్పిడెంట్లు పుష్కలంగా దొరుకుతాయి. దీని వల్ల ఫ్రీ రాడికల్స్‌, ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే నష్టాలను తొలగిస్తుంది. ఇందులో విటమిన్‌ సి, ఎ, కాల్షియం, ఐరన్‌ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.  

Also Read  Hair Loss: ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఈ విటమిన్ల్‌ చాలా అవసరం..

షుగర్ లెవెల్స్‌ అదుపు:

ఆయుర్వేద నిపుణులు ప్రకారం  మునగాకు నీరు తీసుకోవడం వల్ల శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌ చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్‌ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఈ మునగాకు నీరు తీసుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు. 

Also Read  Dry Cough Home Remedies In Telugu: పొడి దగ్గు నుంచి శాశ్వతంగా విముక్తి కలిగించే ఇంటి చిట్కాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News