COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Fever Home Remedies For Adults: జ్వరం ఏ సీజన్‌లోనైన సులభంగా వస్తుంది. అయితే వానా కాలంలో ఈ సమస్య రెట్టింపు అవుతుంది. ఇది సాధారణంగా వాతావరణంలో ఆకస్మిక మార్పు కారణంగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా హై ఫీవర్‌ ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. లేకపోతే ప్రాణాంతకంగా మరే ఛాన్స్‌ కూడా ఉంది. ఆకస్మికంగా వచ్చే వైరల్‌ ఫీవర్‌కు తప్పకుండా చిక్సిత పొందాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ కింది చిట్కాలను పాటించిన సులభంగా ఉపశమనం లభిస్తుంది. 


ఆరోగ్యంగా ఉండేవారి శరీర ఉష్ణోగ్రతలు 98.6 °F (37 °C) ఉండాల్సి ఉంటుంది. బాడీ టెంపరేచర్‌ వీటికి మించి ఉంటే హై ఫీవర్‌ అని అంటారు. ఇలాంటి క్రమంలో శరీరంలో వేడి, బాడీ పెయిన్, వణుకు వంటి లక్షణాలు కూడా రావచ్చు.


అతిగా నీరు తాగండి:
జ్వరంలో బాధపడేవారిలో శరీర ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. కాబట్టి ఇలాంటి క్రమంలో తప్పకుండా అతిగా నీటిని తాగాల్సి ఉంటుంది. జ్వరం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి  కొబ్బరి నీరు లేదా పండ్ల రసం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి. 


Also Read: Manipur Violence: ఏ మాత్రం కనికరం చూపలేదు.. భయంకరమైన ఘటన గుర్తుచేసుకున్న బాధితురాలు


ఉప్పు నీటిని పుక్కిలించాలి:
జ్వరం కారణంగా చాలా మందిలో గొంతునొప్పి, నోటి రుచి కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఉప్పు నీటిని పుక్కిలించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల గొంతు క్లియర్ అవ్వడమేకాకుండా నోటి రుచి కూడా తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. 


విశ్రాంతి తప్పనిసరి:
జ్వరం నుంచి సులభంగా ఉపశమనం లభించడానికి వీలైనంత వరకు బెడ్ రెస్ట్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల మనస్సు కూడా ప్రశాంతంగా మరే అవకాశాలున్నాయి. 


తడి కట్టు తప్పకుండా వినియోగించి:
హై ఫీవర్‌ వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తలపై తడి కట్టు వేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కొంతైనా ఉపశమనం లభించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. 


Also Read: Manipur Violence: ఏ మాత్రం కనికరం చూపలేదు.. భయంకరమైన ఘటన గుర్తుచేసుకున్న బాధితురాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook