Unwanted Hair Removal Tips: కొంతమంది ఫేస్‌, చేతులు, కాళ్ళు మీద అన్ వాంటెడ్ హెయిర్‌ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఓ సర్వే ప్రకారం అన్‌ వాంటెడ్‌ హెయిర్‌ సమస్యతో బాధపడుతున్నవారిలో మహిళలు ఎక్కువగా ఉన్నారని తేల్చి చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దీనికి కారణం హార్మోన్ల అస‌మ‌తుల్య‌త,  వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణమే అని తెలుస్తోంది. అన్‌ వాంటెడ్‌ హెయిర్‌ వల్ల  అంద‌విహీనంగా క‌నిపిస్తాం. అయితే  కొంత మందిలో ఈ సమస్య ఎక్కువగా ఉండడం వల్ల  వ్యాక్స్, రేజ‌ర్స్ వంటి వాటిని ఉప‌యోగిస్తారు. వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల స‌మ‌స్య తీరిన‌ప్ప‌టికి ఆ భాగంలో చ‌ర్మం కోమ‌ల‌త్వాన్ని కోల్పోయి మందంగా, న‌ల్ల‌గా మారుతుంది.  ఇక మీద ఇలాంటి సమస్యలు పడకుండా ఉండాలి అంటే  ఇంట్లో దొరికే పదార్థాల‌తో సులువుగా అన్‌ వాంటెడ్‌ హెయిర్‌ను తొల‌గించుకోవ‌చ్చు.


అన్‌ వాంటెడ్‌ హెయిర్‌ను తొల‌గించండి ఇలా..


ముందుగా ఒక కప్పులో శనగపిండిని తీసుకోవాలి. ఇందులో రోజ్‌ వాటర్‌ను, పసుపును, వ్యాజిలిన్ ను తీసుకోవాలి.  ఈ మిశ్రమని ఇలా తయారు చేసుకోవాలి.. ముందు గిన్నెలో అర టీ స్పూన్‌ వ్యాజిలిన్‌ తీసుకోవాలి. అర టీ స్పూన్‌ పసుపును, ఒకటిన్నర టీ స్పూన్‌ శనగపిండిని కలుపుకోవాలి. తర్వత రోజ్‌ వాటర్‌ ను సరిపడ వేసుకొని మిశ్రమాని ప్యాక్‌లా తయారు చేసుకోవాలి. 


దీని ముఖంపై ఉన్న అన్‌ వాంటెడ్‌ హెయిర్‌ వైపు రుద్దుకోవాలి. పూర్తిగా ఆరే వరకు ఉంచుకోవాలి. తర్వత చల్ల నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అన్‌ వాంటెడ్‌ హెయిర్‌ను సుల‌భంగా తొల‌గించుకోవ‌చ్చు. ఈ టిప్‌ను వాడ‌డం వ‌ల్ల అన్‌ వాంటెడ్‌ హెయిర్‌ తొల‌గిపోవ‌డంతో పాటు చ‌ర్మానికి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది. 


Also read: Ajwain Leaves: వాము ఆకుతో న్యూమోనియా సమస్య నుంచి తక్షణ ఉపశమనం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter