Ice Apple: తాటి ముంజలు తింటే..వేసవి ప్రభావం అస్సలుండదు..నిజంగా ఐస్ యాపిల్ ఇది
Ice Apple: వేసవి ఎండలు గట్టిగా దంచికొడుతున్నాయి. ఉక్కపోత భరించలేకుండా పోయింది. అందుకే ఐస్ యాపిల్ తినమనేది. ఒక్కసారి తింటే ఇక వదిలిపెట్టరు. వేసవి ఎఫెక్టే ఉండదంటే నమ్ముతారా..
Ice Apple: వేసవి ఎండలు గట్టిగా దంచికొడుతున్నాయి. ఉక్కపోత భరించలేకుండా పోయింది. అందుకే ఐస్ యాపిల్ తినమనేది. ఒక్కసారి తింటే ఇక వదిలిపెట్టరు. వేసవి ఎఫెక్టే ఉండదంటే నమ్ముతారా..
ఐస్ యాపిల్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా..తాటి ముంజలు. కొన్ని ప్రాంతాల్లో పుష్కలంగా లభిస్తే..మరికొన్ని ప్రాంతాల్లో అసలివేంటో కూడా తెలియదు. తాడిచెట్లకు కాసే తాటి ముంజ కళ్లు. ఐస్ యాపిల్‌గా పిలుస్తారు. వేసవిలో శరీరం డీహైడ్రేట్ కాకుండా ఇవే కాపాడుతాయి. ఎండకాలంలో చికెన్ ఫాక్స్ రాకుండా నియంత్రిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే తాటి ముంజలతో సమ్మర్ ఎఫెక్టే కన్పించదు.
వేసవిలో ప్రకృతిపరంగా లభించే అద్భుతమైన ఫలాల్లో తాటి ముంజలు ఒకటి. ప్రకృతి ప్రసాదించిన దివ్యౌషదంగా పిలుస్తారు. ఎందుకంటే తాటి ముంజల కళ్లలో ఉండే నీరు అంత అద్భుతంగా ఉంటుంది. మండే ఎండల్లో తాజా ముంజలను తింటే చాలా ఉపశమనం కలుగుతుంది. వీటి వల్ల శరీరానికి చల్లదనమే కాకుండా.. కీలకమైన పోషక పదార్ధాలు కూడా అందుతాయి. మండుటెండల్లో సూర్యుడి తట్టుకునేందుకు తాటిముంజలు తినటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
తాటిముంజల్లో పుష్కలంగా ఉండే పొటాషియం కారణంగా..గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటు అదుపులో ఉండటమే కాకుండా.. రక్త ప్రసరణ సక్రమంగా సాగుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ బయటకుపోయి, మంచి కొలెస్ట్రాల్ అభివృద్ధి చెందుతుంది. కిడ్నీల్లో స్టోన్స్ నిరోధిస్తుంది. ముంజల్లో పుష్కలంగా ఉండే ఫైటోకెమికల్స్ వల్ల వయసు ఛాయలు కన్పించవు. దీర్ఘకాలం యౌవనంగా కన్పించాలంటే..క్రమం తప్పకుండా ఇవి తినాల్సిందే. మరీ ముఖ్యంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఏర్పడే క్లాట్స్‌ను ముంజలు నివారిస్తాయి. వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలోని నీరు ఎక్కువగా బయటకు వెళ్లడం వల్ల డీ హైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. అందుకే వేసవిలో తాటి ముంజలు తీసుకుంటే..డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. శరీరానికి చలవ చేయడం వల్ల..జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. ఎసిడిటీ, మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరానికి మంచి చల్లదనాన్ని అందిస్తాయి.
తాటి ముంజల్లో శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, బి, సి, ఐరన్, జింక్, ఫాస్పరస్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని విషపదార్ధాల్ని బయటకు పంపడంలో సహాయ పడుతుంది. తాటి ముంజల వల్ల శరీరానికి ఇన్‌స్టంట్ ఎనర్జీ లభిస్తుంది. అధిక బరువు రాకుండా నియంత్రిస్తాయి. తాటి ముంజల్లో కేన్సర్‌ను అడ్డుకునే గుణాలు కూడా ఉన్నాయి.
Also read : Health Tips: బ్యాక్ పెయిన్, కండరాల బలహీనత వేధిస్తోందా..ఈ ఆహారం తప్పనిసరి మరి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook