Health Tips: ఆధునిక జీవనశైలి వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తోంది. ఆహారపు అలవాట్లు కావచ్చు..ఒత్తిడి కావచ్చు..కారణమేదైనా బ్యాక్ పెయిన్స్, ఎముకలు-కండరాల సమస్యలు వెంటాడుతున్నాయి. ఏయే ఆహార పదార్ధాల్ని తీసుకుంటే ఈ సమస్య నుంచి విముక్తి పొందుతామో తెలుసుకుందాం..
ఆధునిక జీవనశైలిలో ఎదుర్కొనే ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్ల కారణంగా కొత్త కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఎదురయ్యే బ్యాక్ పెయిన్, ఎముకలు ,కండరాల సమస్యలు యుక్త వయస్సులోనే ఎదురవుతున్నాయి. ఇటువంటి సమస్యలున్నప్పుడు ప్రతిసారీ వైద్యం ద్వారా లేదా మందుల ద్వారా తగ్గించుకోవడమంటే పూర్తిగా ఆ మందులపై ఆధారపడిపోవడమే. అందుకే సహజ సిద్ధంగా కొన్ని ప్రత్యేకమైన ఆహారపదార్ధాల్ని రోజూ తీసుకోవడం ద్వారా ఆ సమస్యల్నించి దూరం కావచ్చు. ఈ సమస్యలు దూరం కావాలంటే కావల్సిది విటమిన్ డి, కాల్షియం ప్రధానం. ఈ రెండింటి వల్ల ఎముకలు ఆరోగ్యంగానే కాకుండా ధృడ నిర్మాణానికి దోహదమవుతుంది. శరీరంలోని ఎముకలు, కండరాలకు పటిష్టత చేకూర్చే ఆహారపదార్ధాలు ఇవి.
అరటిపండులో కీలకమైంది. కేవలం జీర్ణప్రక్రియకే కాకుండా శరీరానికి కావల్సిన మెగ్నీషియం, ఇతర విటమిన్లను సమకూర్చుతుంది. రోజుకో అరటిపండుతో ఎముకలకు బలం కలుగుతుంది. ఇక రెండవది డ్రై ఫ్రూట్స్. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. ఎముకలు కాల్షియంను పీల్చుకోవడానికి, నిల్వ ఉండటానికి మెగ్నీషియం ఎంతో సహాయపడుతుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం..శరీరంలోని మొత్తం పొటాషియంలో కేవలం దంతాలు, ఎముకలే 85 శాతం ఉపయోగించుకుంటాయి.
ఇక మరో ముఖ్యమైన ఆహారం పాలకూర. ఇందులో కాల్షియం అధికంగా ఉంటుంది. రోజూ ఆకు కూరలు తినడం వల్ల ఎముకలు, దంతాలు బలంగా, పటిష్టంగా తయారవుతాయి. ఒక కప్పు ఉడికించిన పాలకూరలో ప్రతిరోజూ శరీరానికి అవసరమయ్యే కాల్షియంలో 25 శాత సమకూరుతుందని అంచనా. ఫైబర్ తో పాటు విటమిన్ ఎ, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇక పండ్ల విషయంలో ఆరెంజ్ కీలకమైంది. ఆరెంజ్ జ్యూస్ రూపంలో అయినా లేదా నేరుగా అయినా తీసుకోవచ్చు. ఇందులోని పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలుచేస్తాయి. ఆరెంజ్‌లో ఉండే కాల్షియం, విటమిన్ డి ఎముకలకు బలం చేకూర్చుతాయి. మరీ ముఖ్యంగా ఆరెంజ్ పండ్లు తింటే ఆస్టియోపొరాసిస్ ఎముకల వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. ఇక బొప్పాయి గురించి ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. ఇందులోని కాల్షియం స్థాయి చాలా ఎక్కువ.100 గ్రాముల బొప్పాయి ముక్కలు తింటే 20 మిల్లీ గ్రాముల కాల్షియం అందుతుందని నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు పాల ఉత్పత్తులు ఎముకలు, కండరాలకు చాలా మంచివి. ఎందుకంటే పాల ఉత్పత్తుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఒక కప్పు పాలు లేదా పెరుగు రోజూ తీసుకుంటే శరీరానికి కావల్సినంత కాల్షియం అందుతుందని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ చెబుతోంది. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎముకల పుష్టికి చాలా దోహదపడతాయి. కొవ్వు అధికంగా ఉండే చేపల ఫ్రై, కర్రీ లేదా పులుసు ఎలా తీసుకున్నా ఫరవాలేదు. సాధారణంగా 35 ఏళ్ల వరకే ఎముకల అభివృద్ధి అనేది జరుగుతుంటుంది. ఆ తరువాత ఎముకలు అరిగిపోవడం లేదా క్షీణించడం ప్రారంభమవుతుంది. అందుకే బలవర్ధకమైన, ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలతో సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవచ్చు.
Also read: Almond Milk and Health Tips: బాదం పాలు అందరికీ మంచిదా కాదా..పరిధి దాటితే వచ్చే సమస్యలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook