Nipah Virus: నిఫా వైరస్ కేరళలో ఆందోళన కల్గిస్తోంది. ఓ వైపు కేసుల సంఖ్య మరోవైపు నిఫా వైరస్ కారణంగా మరణాలు రెండూ పెరుగుతున్నాయి. ఇప్పటికే దీనిపై గత కొద్దికాలంగా అధ్యయనం చేస్తున్న ఐసీఎంఆర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిఫా వైరస్ పై ఐసీఎంఆర్ కీలకమైన సూచనలు జారీ చేసింది. దేశంలో నిఫా వైరస్ కేసులు, మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని ప్రజలు సురరక్షితంగా ఉండేవిధంగా కీలకమైన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. నిఫా వైరస్ గత కొద్దికాలంగా కేరళ తీరాన్ని భయపెడుతోంది. కోవిడ్ కంటే ఈ వైరస్ కారణంగా మరణాల రేటు ఎక్కువగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ వెల్లడించింది. ప్రస్తుతం కేరళలో నిఫా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే నిఫా వైరస్ కారణంగా కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఇప్పటి వరకూ ఇద్దరు మరణించారు. మరో ముగ్గురికి ఈ వైరస్ సోకింది. ఇప్పటికే కేంద్ర బృందం కోజికోడ్ జిల్లాకు చేరుకుని సహాయక చర్యలు మొదలెట్టింది. నిఫా వైరస్ మరింత సంక్రమణ చెందకుండా పదే పదే చేతులు  కడుక్కోవడం, మాస్క్ ధరించడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. 


కోవిడ్ వైరస్‌తో పోలిస్తే నిఫా వైరస్‌లోనే మరణాల రేటు 40-70 శాతం అధికంగా ఉందని ఐసీఎంఆర్ తెలిపింది. కోవిడ్‌లో మరణాల రేటు 2-3 శాతమే ఉండేది. కేరళలో నిఫా వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో దీనిని అరికట్టేందుకు ఆస్ట్రేలియా నుంచి మోనోక్లోనల్ యాండీబాడీస్ 20 డోసులు తెప్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి జంతువుల్నించి ఈ వ్యాధి సోకింది. కలుషిత ఆహారం లేక ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి సోకుతుంది. 


విదేశాల్లో ఇప్పటి వరకూ 14 మందిలో నిఫా వైరస్ లక్షణాలు ఉంటే..మోనోక్లోనల్ డోసులతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. మోనోక్లోనల్ డోసులు కూడా కేవలం తొలి దశ ట్రయల్ మాత్రమే పూర్తి చేసుకున్నాయని తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగిస్తున్నామని ఐసీఎంఆర్ వెల్లడించింది.


Also read: Dengue Precautions: డెంగ్యూ వ్యాధి లక్షణాలేంటి, ఈ పద్ధతులు పాటిస్తే అద్భుతంగా నియంత్రించవచ్చు



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook