More Time on Toilet Seat: ఈ బిజీ లైఫ్‌లో ప్రతి పనీ హడావుడిగానే చేస్తాం. చివరికి టాయిలెట్‌ వెళ్తే కూడా ఫోన్ తీసుకుని వెళ్తారు. ఏవైనా ఫోన్‌ కు సంబంధించిన పనులు ఉంటే కూడా టాయిలెట్‌ సీటుపై కూర్చొని చేసుకుంటారు. ఇలా ఫోన్లో నిమగ్నమై ఎక్కువ సమయం అక్కడే గడుపుతారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరోగ్య సమస్యలు..
టాయిలెట్‌ సీట్‌పై మనం ఎక్కువసేపు సమయం గడిపితే ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉందట. ముఖ్యంగా టాయిలేట్‌ రూంలో పది నిమిషాల కంటే ఎక్కువ సమయం గడపకూడదు. ఎందుకంటే ఇలా ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


నడుం నొప్పి..
టాయిలేట్ సీటుపై ఎక్కువ సమయం ఇలా ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల నడుముపై అధిక ఒత్తిడి పెరుగుతుంది. దీంతో బ్యాక్‌ పెయిన్ సమస్యలు కూడా రావచ్చు. అంతేకాదు కండరాల్లో వాపు, తిమ్మిరి సమస్యలు కూడా వస్తాయి. 


ఇదీ చదవండి: పిల్లల ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే వారి డైట్లో ఈ 5 ఆహారాలు ఉండాల్సిందే..


నరాల ఒత్తిడి..
ముఖ్యంగా టాయిలేట్‌ సీటుపై ఎక్కువ సమయం గడిపితే కాళ్లు మాత్రమే కాదు చేతుల్లో కూడా ఒత్తిడి ప్రభావం కలుగుతుంది. దీన్ని పించ్డ్‌ వెయిన్స్ అంటారు. నరాల సమస్యలతో బాధపడేవారు ముఖ్యంగా టాయిలేట్ల్ ఎక్కువ సమయం ఉండకూడదు. లేకపోతే మెడ నరాల నుంచి సైతం ఒత్తిడి పెరుగుతుంది.


పైల్స్..
టాయిలేట్‌ సీటుపై కూర్చొని ఉండటం వల్ల పాయువుపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో వాపు సమస్యలు వస్తాయి. ఇది పైల్స్‌కు దారితీస్తుంది. దీంతో తీవ్ర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఎక్కువ సమయం టాయిలేట్‌ సీటుపై కూర్చొవడం మంచిది కాదు.  రక్త ప్రసరణ తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో నడుం కింది భాగంలో ఒత్తిడి పెరుగుతుంది. పాదాల్లో తిమ్మిరి పెరుగుతుంది.
దీనిని నివారించడానికి టాయిలెట్లో కనీస సమయం తీసుకోవడం మంచిది.


ఇదీ చదవండి: ఈ సమస్య ఉన్నవారికి బీట్‌రూట్‌ విషం.. తినేముందు వేయిసార్లు ఆలోచించండి..!
అయితే, కొందరు మాత్రం ఎక్కువసేపు కడుపు సమస్యలతో టాయిలెట్ సీటుపై గంటల తరబడి కూర్చుంటారు. మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి. అంతేకాదు టాయిలేట్‌ సీటుపై ప్రమాదకరమైన బ్యాక్టిరియా ఉంటుంది. ఇది మీరు మొబైల్ తీసుకెళ్తే, టాయిలేట్‌ పేపర్‌పై కూడా ఉంటుంది. మొబైల్‌ శుభ్రం చేయకపోతే ఇన్పెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook