High Blood Pressure: చెంచా సిరప్‌తో అధిక రక్తపోటుకు శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు!
High Blood Pressure Ayurvedic Home Remedies: శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరగడం కారణంగా అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. దీంతోపాటు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ఈ క్రింది చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
High Blood Pressure Ayurvedic Home Remedies: ప్రస్తుతం దీర్ఘకాలిక వ్యాధులు యువతను పట్టిపీడిస్తున్నాయి. చాలామంది రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాకుండా గుండెపోటు బారిన పడి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే ఇవన్నీ సమస్యలు రావడానికి ఒకటే వ్యాధి కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు శరీరంలోని అధిక రక్తపోటు కారణంగా పై దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయని వారంటున్నారు. సైలెంట్ కిల్లర్ గా చెప్పుకునే ఈ వ్యాధి.. మనిషి ప్రాణాలతో ఆడుకుంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమస్యతో బాధపడేవారు ఆరోగ్యం ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ప్రాణాలకే ముప్పు అవుతుంది.
ప్రస్తుతం చాలామందిలో కొలెస్ట్రాల్ పరిమాణాలు విచ్చలవిడిగా పెరగడం కారణంగా అధిక రక్తపోటు సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలను నియంత్రించుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ కొలెస్ట్రాల్ పరిమాణాలను తగ్గించుకోవడానికి తప్పకుండా ఆహారాల్లో ఫైబర్ పరిమాణాలు అధికంగా ఉండేటట్లు చూసుకోవాలి. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన డైట్ ఆహారాలను ప్రతిరోజు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
రక్తంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు తగ్గించేందుకు రక్తపోటును అదుపులో ఉంచేందుకు కొవ్వులేని పాలు కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి ఆహారాలు డైట్ పద్ధతిలో తీసుకునేవారు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి ప్రతిరోజు కొవ్వులేని పాలను తాగాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ పాలు తాగే క్రమంలో చక్కెరకు బదులుగా బెల్లాన్ని వినియోగించి తాగడం వల్ల రెట్టింపు లాభాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా ప్రతిరోజూ తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు నియంత్రణలో ఉండడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా సులభంగా పెరుగుతుంది.
రక్తపోటును అదుపులో ఉంచడానికి యాపిల్ సైడర్ వెనిగర్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒక గ్లాసు నీటిలో చెంచా ఈ వెనిగర్ ని కలుపుకొని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలను నియంత్రించేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ ప్రభావంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి