Green Tea Side Effects: గ్రీన్ టీ.. గ్రీన్ టీ.. గ్రీన్ టీ.. అవును శరీర బరువును తగ్గించుకునేందుకు, కొలెస్ట్రాల్ పరిమాణాలను నియంత్రించుకునేందుకు, రక్తపోటుకు బై బై చెప్పేందుకు.. ఇలా ఒకటి కాదు రెండు కాదు 100 వ్యాధులకు ఈ టీ ప్రభావంతంగా సహాయపడుతుంది. అందుకే భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ టీ తాగే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం చాలామంది జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతిరోజు గ్రీన్ టీ లను విచ్చలవిడిగా తాగుతున్నారు. ఇలా ప్రతిరోజు విచ్చలవిడిగా తాగితే మీరు పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే గ్రీన్ టీ ని ఎప్పుడు అతిగా తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ లను అతిగా తాగడం వల్ల అందులో ఉండే ఆయుర్వేద గుణాలు శరీరంలోని అవయవాలపై ప్రభావం చూపవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


Also Read: Virat Kohli: నేను బౌలింగ్‌ చేసుంటే రాజస్తాన్‌ 40 పరుగులకే ఆలౌటయ్యేది.. విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!  


అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయొచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు పరిమితంగా మాత్రమే గ్రీన్ టీ లను తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అతిగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తే తప్పకుండా వైద్యులను సంప్రదించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గ్రీన్ టీ తీసుకునే క్రమంలో ఈ క్రింది తప్పులను కూడా ప్రతిరోజు మీరు చేస్తున్నారు. కాబట్టి ఈ క్రింది పనులను గ్రీన్ టీ తీసుకునే క్రమంలో చేయకపోవడం చాలా మంచిది.


శరీరంలో కొలెస్ట్రాల్ ను నియంత్రించుకోవడానికి ప్రస్తుతం చాలామంది గ్రీన్ టీలను ఖాళీ కడుపుతో తాగుతున్నారు. ఇలా తాగడం వల్ల గ్రీన్ టీ లో ఉండే టానిన్ లోని యాసిడ్ పరిమాణాలను పెంచి జీర్ణక్రియ పై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా పొట్ట సమస్యలు జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


చాలామంది గ్రీన్ టీ శరీరానికి మంచిదని విచ్చలవిడిగా తాగుతున్నారు. ఇలా తాగడం వల్ల ఆందోళన నిద్రలేని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్ టీ ని తాగడం చాలా మంచిది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గ్రీన్ టీ తాగే క్రమంలో మూడు నుంచి నాలుగు గంటల గ్యాప్ తీసుకుని తాగడం మంచిది.


ప్రస్తుతం చాలామంది గ్రీన్ టీని తిన్న వెంటనే తాగుతున్నారు. ఇలా తాగడం వల్ల శరీరంలో ఐరన్ లోపించి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా పొట్ట సమస్యలు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గ్రీన్ టీ ని తిన్న తర్వాత రెండు నుంచి మూడు గంటల పాటు గ్యాప్ తీసుకొని తాగడం మంచిది.


Also Read: Virat Kohli: నేను బౌలింగ్‌ చేసుంటే రాజస్తాన్‌ 40 పరుగులకే ఆలౌటయ్యేది.. విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.