Immunity Boost Drink: తీవ్రమైన చలి, వాతావరణ మార్పుల కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాక శరీరంలోని రోగనిరోధక శక్తి తగ్గిపోతోంది. దీని కారణంగానే అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ చలి కాలంలో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శీతాకాంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తప్పకుండా కొన్ని హోమ్‌ మేడ్‌ డ్రింక్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అల్లం, ఉసిరికాయతో తయారు చేసిన డ్రింక్‌ను తీసుకోవడం వల్ల శీతాకాలంలో వచ్చే తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం పొందవచ్చు. అయితే చలి కాలంలో ఏయే డ్రింక్స్‌ ప్రతి రోజు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


అల్లం, ఉసిరికాయ డ్రింక్‌ తయారికి కావాల్సిన పదార్థాలు: 
పెద్ద ముక్కలు అల్లం 2
పచ్చి పసుపు 2 ముక్కలు 
నల్ల మిరియాలు
తేనె 
నీరు 
నిమ్మకాయలు 4 
ఉసిరికాయ మిశ్రమం


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది అందులో అల్లం ఉసిరి ముక్కలను కట్ చేసుకుని నిమ్మరసాన్ని కలపాలి. ఇలా కలిపిన తర్వాత వాటిని బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్లో రెండు కప్పుల నీటిని పోసుకొని.. అందులోనే గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత దీనిని వడకట్టుకొని ఫ్రిజ్లో రెండు గంటల పాటు ఉంచి ఆ తర్వాత తాగొచ్చు.


ఈ డ్రింక్ తాగడం వల్ల కలిగే లాభాలు:
శీతాకాలంలో తరచుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ అల్లంతో తయారు చేసిన డ్రింక్ ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే ఉండే ఔషధ గుణాలు చలికాలంలో వచ్చే అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా ఈ డ్రింక్ ని తాగడం వల్ల దగ్గు జలుబు ఇతర సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి సులభంగా విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా కఫం సమస్యతో బాధపడుతున్న వారు కూడా దీనిని తాగవచ్చు.


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter