చలికాలం కావడంతో వ్యాధుల ముప్పు పెరుగుతోంది. వ్యాధుల్నించి కాపాడుకోవాలంటే ముందుగానే సన్నద్ధత అవసరం. అంటే మీ డైట్‌లో ఆరోగ్యకరమైన డ్రింక్స్ తప్పనిసరిగా ఉండాలి. ఈ డ్రింక్స్ ఇమ్యూనిటీని పెంచడంతో దోహదపడతాయి. 7 రకాల ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్స్‌‌ను వారంలో 7 రోజులు తాగితే..చాలా మంచిది. వివిధ వ్యాధుల్నించి కాపాడుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లోవెరా-ఉసిరి జ్యూస్


అల్లోవెరా ఉసిరి రెండింట్లోనూ ఆరోగ్యకరమైన న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. దీనివల్ల శరీరానికి బలం చేకూరుతుంది. వ్యాధుల్నించి పోరాడటంతో ఉపయోగపడుతుంది. 


టొమాటో జ్యూస్


టొమాటో జ్యూస్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. టొమాటో జ్యూస్ తాగడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. టొమాటో వేడి సూప్ చాలా మంచిది.


క్రాన్‌బెర్రీ జ్యూస్


క్రాన్‌బెర్రీ చాలామందికి తెలియదు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ ఫ్రూట్‌తో ఇమ్యూనిటీ గణనీయంగా పెరుగుతుంది. క్రాన్‌బెర్రీ జ్యూస్ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 


వెజిటబుల్ జ్యూస్


కూరగాయల్లో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఉండటం వల్ల వివిధ రకాల వ్యాధుల్నించి కాపాడటంలో ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. కూరగాయల జ్యూస్ తాగడం వల్ల ఇమ్యూనిటీ గణనీయంగా పెరుగుతుంది. 


స్ట్రాబెర్రీ జ్యూస్


స్ట్రాబెర్రీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో స్ట్రాబెర్రీ జ్యూస్ తాగడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. గుండెకు కూడా చాలా మంచిది.


పాలకూర జ్యూస్


పాలకూరలో ప్రోటీన్లు, విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. పాలకూర జ్యూస్ తాగడం వల్ల వివిధ రకాల వ్యాధుల్ని దూరం చేయవచ్చు. అంతేకాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది.


క్యారట్ జ్యూస్


క్యారట్‌లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. క్యారట్‌లో కెరోటీన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.


Also read: Health Tips: జలుబు, దగ్గుతో పాటు కరోనాను సైతం దూరం చేసే ఆయుర్వేద కాడా, ఇలా తయారు చేసుకోవచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook