Anjeer Health Benefits: శరీరానికి కావాల్సిన  పోషకాలను అందించడంలో డ్రై ఫ్రూట్స్  ఎంతో సహాయపడుతాయి.  అంతేకాకుండా అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఈ ఫ్రూట్స్ కాపాడుతాయి. వీటిని మనం స్వీట్స్‌, ఇతర వంటకాల్లో ఉపయోగించడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.  అయితే డ్రై ఫ్రూట్స్‌లో అంజీర్ కూడా ఒకటి. అంజీర్ పండులో ఎన్నో పోషకాలు, ఆరోగ్య విలువలు దాగి ఉన్నాయి. ఈ ఫ్రూట్‌ను చాలా మంది తీపి ఆహార పదార్థాల్లో  ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం.   అంజీర్ పండు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోగాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంజీర్‌ పండులో విటమిన్ సి, ఐరన్, కార్బోహైడ్రేట్స్,  పొటాషియం, మెగ్నీషియం ఇతర పోషకాలు అధికంగా లభిస్తాయి. ఈ పండు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని రాత్రి పూట నానబెట్టి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఇలా నానబెట్టిన అంజీర్‌ను తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే వేడిని తొలగించవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఎముకలను, గుండెను ఆరోగ్యం ఉంచడంలో అంజీర్‌ సహాయపడుతుంది.


అంతేకాకుండా అంజీర్‌ పండు తినడం వల్ల శరీరంలో ఉండే మలినాలను తొలగించడంలో ఎంతో మేలు చేస్తుంది.అంజీర్ లో లభించే ఫైబర్ పొట్టను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. అలాగే అధిక రక్తపోటు సమస్యను అదుపు చేయడంలో సహాయపడుతుంది. అంజీర్‌ను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కండరాల నొప్పులు, భుజాల నొప్పులు తగ్గుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 


అంజీర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తుండి. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు ఈ అంజీర్‌ను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. 


Also read: Gut Health Foods: పేగుఆరోగ్యానికి ఈ 7 అద్భుతమైన ఆహారాలు.. మీ శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఇందులోనే ఉంటాయట..!


అంజీర్‌  తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు వంటి సమస్య నుంచి బయటపడవచ్చు. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు కూడా ఈ డ్రై ఫ్రూట్‌ను తీసుకోవడం వల్ల సమస్య తగ్గుతుంది. 


గొంతు నొప్పిని త‌గ్గించ‌డంలో అంజీర్ దోహ‌ద‌ప‌డుతుంది. రోజూ మూడు అంజీర్ ల‌ను నీటిలో నాన‌బెట్టి ఉద‌యాన్నే తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.


Also read: Why Black Grapes Costly: ఆకుపచ్చ ద్రాక్ష కంటే నల్ల ద్రాక్ష ఎందుకు ఖరీదైంది? ఎప్పుడైనా ఈ లాజిక్ ఆలోచించారా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter