Food Habits To Improve Digestive Health: జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే శరీరం కూడా హోల్తీగా శక్తివంతంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే పొట్టలో ఆకలిగా అనిపిస్తుంది. జీర్ణక్రియ సమస్యలున్నవారిలోనే ఎక్కువగా గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం, ఆమ్లత్వం వంటి పొట్ట సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారిలో మానసిక స్థితి, శక్తి స్థాయి, జుట్టు నాణ్యత, ఋతు చక్రం, నిద్ర నాణ్యతలు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ జీర్ణక్రియ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఆధునిక జీవనశైలితో పాటు అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడమేనని వారంటున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీర్ణక్రియ మెరుగుపడడానికి అద్భుత చిట్కాలు:
టీ, కాఫీ:

కొందరిలో జీర్ణక్రియ సమస్యలు ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగడం వల్ల కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ప్రతి రోజు ఖాళీ కడుపుతో టీలతో పాటు కాఫీలను తాగడం మానుకోవాల్సి ఉంటుంది.


పండ్లను పెరుగు లేదా పాలలో తీసుకొవద్దు:
తరచుగా ఫ్రూట్ షేక్ చేసే క్రమంలో పాలను వినియోగిస్తారు. ఇలా పాలను మిక్స్‌ చేసి తయారు షేక్‌ను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట తీసుకోవడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


అల్పాహారం తప్పకుండా తీసుకోవాలి:
ప్రస్తుం చాలా మంది ఉదయం పూట బిజీగా ఉండడం వల్ల అల్పాహారాలను తీసుకోవడం మానుకుంటున్నారు. ఇలా అస్సలు చేయోద్దని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అల్పాహారంలో రసాలు, చల్లని పాలు కూడా తీసుకోవడం జీర్ణక్రియకు హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


రాత్రిపూట ఇలా చేయండి:
జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా ప్రతి రోజు 7:30కి డిన్నర్ చేయడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మందిలో రాత్రి పూట ఆలస్యంగా ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా జీర్ణక్తియ దెబ్బతింటోదని వారంటున్నారు. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter