Corona Nasal vaccine: ప్రపంచాన్ని భయపెట్టిన కరోనాకు ఇప్పుడు మరో వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. ఈ వ్యాక్సిన్ మిమ్మల్ని భయపెట్టదు. దేశంలోని తొలి నాజిల్ డ్రాప్స్ వ్యాక్సిన్‌కు అనుమతి లభించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలోని తొలి నాజల్ వ్యాక్సిన్‌కు అనుమతి లభించింది. ఇప్పుడిక కరోనా వ్యాక్సిన్ మిమ్మల్ని భయపెట్టదు. ముక్కులో డ్రాప్స్ ద్వారా సులభంగా వేయించుకోవచ్చు. మేకిన్ ఇండియా కంపెనీ భారత్ బయోటెక్..ఇంట్రానాజల్ కోవిడ్ 19 వ్యాక్సిన్‌కు డీసీజీఐ అత్యవసర అనుమతి మంజూరు చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సూఖ్ మాండవియా ఈ విషయాన్ని వెల్లడించారు.


కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశంలో అభివృద్ధి చేసిన తొలి నాజల్ వ్యాక్సిన్ ఇదే. డీసీజీఐ ఇప్పుడు 18 కంటే ఎక్కువ వయస్సన్నవారికి ప్రైమరీ వ్యాక్సినేషన్ కోసం నాజల్ వ్యాక్సిన్‌‌కు అనుమతి మంజూరు చేసింది. కోవిడ్ 19 కు వ్యతిరేకంగా భారదదేశం జరుపుతున్న పోరాటానికి అతిపెద్ద బూస్ట్ లభించిందని డాక్టర్ మన్సూఖ్ మాండవియా తెలిపారు. భారత్ బయోటెక్ కంపెనీ ChAd36-SARS-CoV-S COVID-19 రీకాంబినెంట్ వ్యాక్సిన్‌కు అత్యవసరం కింద 18 ఏళ్లు పైబడినవారికి ఇచ్చేందుకు అనుమతి లభించింది.


ప్రస్తుతం వ్యాక్సిన్‌ను మజిల్స్‌కు ఇంజక్షన్ ద్వారా ఇస్తున్నారు. అందుకే దీనిని ఇంట్రా మస్క్యులర్ వ్యాక్సిన్‌గా పిలుస్తున్నారు. ముక్కు రంధ్రాల్లో డ్రాప్స్ ద్వారా ఇచ్చేందుకు చేసే వ్యాక్సిన్‌ను నాజిల్ వ్యాక్సిన్ లేదా ఇంట్రా నాజల్ వ్యాక్సిన్ అంటారు. ఇది ఓ రకంగా నాజిల్ స్ప్రే లాంటిదే. 


నాజిల్ వ్యాక్సిన్ లాభాలు


వైరస్‌ను ముక్కులోనే అంతం చేయవచ్చు. ఊపిరితిత్తుల వరకూ వ్యాపించకుండా నిరోధించవచ్చు. ముక్కులో డ్రాప్స్‌లా ఈ వ్యాక్సిన్ మందును వేస్తారు. హెల్త్ వర్కర్లకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉత్పత్తి, స్టోరేజ్ రెండూ చాలా సులభం. వృధా జరగదు. పిల్లలకు కూడా సులభంగా ఇవ్వవచ్చు.


Also read: Brown Rice Benefits: వైట్ రైస్..బ్రౌన్ రైస్‌కు తేడా ఏంటి, వైట్ రైస్ వల్ల కలిగే లాభాలేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook