Breast Cancer Causes: బ్రెస్ట్ కేన్సర్. మహిళల్లో ఎక్కువగా కన్పించే వ్యాధి. బ్రెస్ట్ కేన్సర్ విషయమై మహిళల్లో చాలా భ్రమలు ఉంటాయి. ధరించే బ్రా...బ్రెస్ట్ కేన్సర్‌కు కారణమౌతుందా అనేది చర్చనీయాంశమైన అంశంగా మారింది. ఇందులో ఎంతవరకూ నిజముందో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహిళల్లో ఎక్కువగా కన్పించే బ్రెస్ట్ కేన్సర్ విషయమై చాలా భ్రమలు, వివిధ రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కొంతమంది ముందు వెనుకా ఆలోచించకుండా నమ్మేస్తుంటారు కూడా. కొన్ని నిజాలుంటే..ఇంకొన్ని అబద్ధాలుంటాయి. ధరించే బ్రా..బ్రెస్ట్ కేన్సర్‌కు కారణమౌతుందని కొందరు భావిస్తుంటే..బ్రా ఎక్కువ సేపు ధరిస్తే బ్రెస్ట్ కేన్సర్ వస్తుందని ఇంకొందరు అనుకుంటుంటారు. టైట్ బ్రా ధరించినా..బ్రెస్ట్ కేన్సర్ వస్తుందని నమ్మేవాళ్లు ఇంకొందరు. లేదా నల్ల రంగు బ్రా ధరిస్తే..బ్రెస్ట్ కేన్సర్ వస్తుందని భావించేవాళ్లు కూడా లేకపోలేదు. ఇలాంటి విషయాల్ని అలాగే వదిలేస్తే ప్రమాదమే. అందుకే ఏది వాస్తవమో ఏది కాదో తెలుసుకోవల్సిన అవసరముంది. ఈ క్రమంలో అసలు బ్రెస్ట్ కేన్సర్‌కు బ్రా ఎంతవరకూ కారణం..అసలు కారణమా కాదా అనేది పరిశీలిద్దాం..


బ్రెస్ట్ కేన్సర్ అంటే ఏమిటి


ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం బ్రెస్ట్ కేన్సర్ అనేది మహిళల్లో సాధారణంగా కన్పించే వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి యేటా 2.1 మిలియన్ మహిళలు ఈ కేన్సర్ బారిన పడుతున్నారు. జన్యు పరివర్తనం కారణంగా వక్షోజాల కణాలు విభజితమౌతుంటాయి. అపరిమితంగా పెరుగుతూ..విస్తరిస్తుంటాయి


బ్రా ధరించడం వల్ల బ్రెస్ట్ కేన్సర్ ముప్పు ఉంటుందా


కేన్సర్ నిపుణులు ప్రకారం ధరించే బ్రాకు..బ్రెస్ట్ కేన్సర్‌కు నేరుగా ఏ విధమైన సంబంధం లేదు. అంటే ఇదొక భ్రమ మాత్రమే. ఈ భ్రమ కారణంగా మహిళల్లో అపోహలు పెరిగిపోతున్నాయి. అండర్ వైర్ బ్రా లేదా టైట్ బ్రా ధరించడం వల్ల లింఫ్స్‌లో రక్త ప్రసరణ ఆగిపోతుందని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు. ఫలితంగా కేన్సర్ ముప్పు పెరుగుతుందని భావిస్తున్నారు. కానీ ఇదంతా అవాస్తవం. బ్రా ధరిస్తే కేన్సర్ వస్తుందని..టైట్ బ్రా ధరిస్తే వస్తుందని విన్పిస్తున్నవన్నీ అబద్ధాలే. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు. 


బ్రెస్ట్ కేన్సర్ లక్షణాలు


మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ సమస్య ఉంటే..తీవ్రమైన మచ్చ లేదా గాయం కన్పిస్తుంది. నిపుల్స్ ఎర్రగా మారడం, అండర్ ఆర్మ్స్‌లో వాపు లేదా మచ్చలుండటం లక్షణాలు కావచ్చు. వక్షోజాల ఆకారం మారడం లేదా నిపుల్స్‌లోంచి రక్తం లాంటి ద్రవ పదార్ధం బయటకు రావడం వంటి సమస్యలుంటాయి.


Also read: Diabetes Tips: నియంత్రణే తప్ప..పూర్తి పరిష్కారం లేని వ్యాధి మధుమేహం..అందుకే ఈ జాగ్రత్తలు తప్పవు



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook