బయట మార్కెట్లో విరివిగా లభ్యమయ్యే కూరగాయల్లో దొండకాయ కూడా ఒకటి. దొండకాయను వివిధ రకాలుగా వండుకొని చపాతి, అన్నంతో తినవచ్చు. చూడటానికి చిన్నగా, పొట్టిగా కనపడుతుంది కదా అని దీని గురించి తక్కువ అంచనా వేసుకుంటే పొరబడినట్లే. ఇందులో ఔషధ గుణాలు ఏముంటాయిలే అని అనుకుంటాము.  దొండను ఎక్కువగా తింటే మందబుద్ధి వస్తుంది అని చెప్పేవారు కూడా లేకపోలేరు. అయతే అది ఒక అపోహ మాత్రమే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

* దొండకాయలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. పీచూ, ప్రోటీన్లు కూడా లభ్యమవుతాయి.


* ఇందులోని యాక్సిడెంట్లు బాక్టీరియాలను అడ్డుకుంటాయని ఆయుర్వేదం చెబుతుంది.


* ఇందులో ఉండే యాంటీ- హిస్టమైన్ గుణాల వల్ల అలర్జీ రాదు. దగ్గు, ఆకలి లేకపోవడం.. వంటి వాటితో బాధపడేవారు దీన్ని తినడం వల్ల ఫలితం ఉంటుంది.


* ఇందులో ఉండే బి-విటమిన్ నాడీవ్యవస్థను రక్షిస్తుంది. మానసిక ఆందోళన, మూర్ఛ వ్యాధితో బాధపడేవారికి దొండ చక్కటి పరిష్కారం. 


* ఇందులో ఉండే కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. ఎముకలకు గట్టిదనాన్ని ఇస్తుంది.


* దొండకాయను మధుమేహ వ్యాధిగ్రస్థులు  తినవచ్చు. శరీరంలో చక్కర శాతాన్ని తగ్గిస్తుంది.


* థైమీన్ దొండలో పుష్కలంగా ఉంటుంది. కొవ్వు, ప్రొటీన్ల జీవక్రియకీ ఉపయోగపడుతుంది. బీ- కాంప్లెక్స్ విటమిన్లు జీర్ణవ్యవస్థకీ మేలుచేస్తాయి.


* ఇందులోని  సి విటమిన్, బీటాకెరోటిన్లు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.


* రిబోఫ్లేవిన్ పుష్కలంగా ఉండే దొండకాయ మనసును ప్రశాంతంగా ఉంచి, డిప్రెషన్ ను తగ్గిస్తుంది.